Templates by BIGtheme NET
Home >> Telugu News >> స్కూల్స్ ఓపెన్ చేయడం సాధ్యమైయ్యే పనేనా ?

స్కూల్స్ ఓపెన్ చేయడం సాధ్యమైయ్యే పనేనా ?


కరోనా మహమ్మారి రోజురోజుకి తన ప్రభావాన్ని పెంచుకుంటూపోతుంది. సరైన టీకా మందు లేకపోవడం తో కరోనా జోరుకి బ్రేకులు వేసే వారే లేరు. ప్రస్తుతం ఈ కరోనా వ్యాక్సిన్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే దేశంలో కరోనా వ్యాప్తి విజృంభణ మొదలైంది అని భావించి దాన్ని అరికట్టేందుకు లాక్ డౌన్ ను అమల్లోకి తీసుకువచ్చారు. అప్పటి నుండి విద్యాసంస్థలు పూర్తిగా మూతబడ్డాయి. ఆ తరువాత కొద్దిరోజులకే ఆన్లైన్ క్లాసులు కొన్ని విద్యాసంస్థలు ప్రారంభించాయి. అయితే ఈ మధ్య ఏపీలో పక్కా ప్రణాళికలతో శానిటైజ్ చేస్తూ కరోనా నియమాలని పాటిస్తూ .. 9 10 వ తరగతి విద్యార్ధులకి స్కూల్స్ ఓపెన్ చేసారు. అయితే ఎన్ని నియమాలు పాటించినా కూడా విజయనగరం జిల్లా గంట్యాడలో 27మంది స్కూల్ పిల్లలకు కరోనా సోకింది. వీరంతా 9 10 తరగతి విద్యార్థులే. ఈ ఘటనకు రెండు రోజుల ముందే గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలో ట్యూషన్ కి వెళ్లిన కారణంగా చాలామంది పిల్లలు కరోనా భారిన పడ్డారు. దీనితో తల్లిదండ్రులతో పాటుగా ప్రభుత్వం కూడా ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది.

ఈ నేపథ్యంలో నవంబర్ 2 నుంచి పిల్లలకు తరగతులు ప్రారంభించడం కూడా కష్టసాధ్యమేననే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. పసిపిల్లల ప్రాణాలు పణంగా పెట్టి వారికి పాఠాలు బోధించాల్సిన అత్యవసరం ఏమిలేదు. మహా అయితే ఒక విద్యా సంవత్సరం వృథా అవుతుంది. ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదుకదా. ప్రాణాలతో ఉంటే సెలవుల్లో కూడా స్కూల్స్ పెట్టుకొని నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేయవచ్చు. ఇంట్లో ఉంటే పిల్లల చదువు పాడైపోతోందని అన్నీ మరచిపోతున్నారని పూర్తిగా సెల్ ఫోన్ గేమ్స్ కి బానిసలుగా మారుతున్నారనే కారణంగా తల్లిదండ్రులు కొన్నిచోట్ల ధైర్యం చేసి ట్యూషన్లకు పంపిస్తున్నారు. అయితే ఉన్నట్టుండి స్కూల్ పిల్లలకు ట్యూషన్ కి వెళ్లిన కరోనా సోకడంతో తల్లిదండ్రులు మళ్లీ ఆలోచనలో పడ్డారు.

స్కూల్ లో పిల్లల మధ్య సామాజిక దూరం పాటించమని చెప్పడం మన మూర్ఖత్వమే. పసితనంలో స్నేహితుడిని దూరంగా పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఒకరి వాటర్ బాటిల్స్ మరొకరు తీసుకోవడం పెన్నులు పెన్సిళ్లు పుస్తకాలు మార్చుకోవడం.. లాంటివి చేయకుండా పిల్లలపై ఆంక్షలు విధించడం దాదాపు అసాధ్యం. కాబట్టి స్కూల్ కి పంపించకపోవడమే ప్రస్తుతం మనకున్న ఏకైక మార్గం. మేలు. ప్రభుత్వం కూడా ఈ దిశగానే ఆలోచిస్తుండటం వల్లే విద్యాదీవెన కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంది. అలాగే నవంబర్ నుండి స్కూల్స్ ఓపెన్ అని చెప్పిన ప్రభుత్వం కూడా దీనిపై మరోసారి సమీక్ష జరిపి విద్యార్థుల ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదని సరైన నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తుంది. ఇన్ని రోజుల పాటు ఎలాగూ స్కూల్స్ పెట్టలేదు. ఇదే విధంగా మరికొన్ని రోజులు కొనసాగించి వ్యాక్సిన్ వచ్చి పరిస్థితులు చక్కబడిన తర్వాతే పిల్లలను పాఠశాలల్లోకి అనుమతించడం అందరికి శ్రేయస్కరం.