రేవంత్ రెడ్డి ఆ సర్వే టీంతో సర్వే చేయిస్తున్నాడా?

0

కాంగ్రెస్ ఎంపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బాగా దూకుడు మీద ఉన్నాడు. కాంగ్రెస్ తరుఫున ఎంతో మంది దిగ్గజాలున్నా.. సోషల్ మీడియాలో వారందరినీ వెనక్కి నెట్టి రేవంత్ రెడ్డి పేరు తెగ ట్రెండింగ్ లోకి వస్తోంది. కానీ కాంగ్రెస్ లో రేవంత్ జూనియర్ కాబట్టి అతడికి సీనియర్ నాయకులతో పడడం లేదు.

కాంగ్రెస్ లో ఎలాగైనా ఎదిగి సీఎం పోస్టు టార్గెట్ గా రేవంత్ పెట్టుకున్నాడు. అందుకే జాతీయ నాయకులతో బాగా టచ్ లో ఉంటున్నాడట.. అయితే కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థిగా తనను ఎంపిక చేయకపోతే కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో రేవంత్ ఉన్నాడేమోనన్న ప్రచారం సాగుతోంది.

రేవంత్ రెడ్డి అదే ప్లాన్ తో ఇప్పుడు బూత్ లెవల్ స్థాయి నుంచి తన టీంను రెడీ చేసుకునే పనిలో పడ్డాడట.. ప్రతీ బూత్ నుంచి ఐదుగురు మెంబర్స్ ను అన్ని కులాల నుంచి తయారు చేయాలని.. ఆ పనిని తమిళనాడులో ఉన్న ఒక సర్వే కంపెనీతో డీల్ చేసుకున్నారని ప్రచారం సాగుతోంది. వాళ్ల పని రేవంత్ రెడ్డిని ప్రమోట్ చేయడం.. బూత్ స్థాయిలో రేవంత్ రెడ్డి తరుఫున ఐదుగురు మెంబర్స్ ను రెడీ చేయడం.. వాళ్ల ద్వారా బూత్ స్థాయిలో బలోపేతం చేయడం అని ఈ విధంగా ప్రణాళిక వేసుకొని చేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్నారు.

ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ సీఎం అభ్యర్థి కేటీఆర్ అని ట్రెండింగ్ లో ఉంటే.. కాంగ్రెస్ తరుఫున రేవంత్ రెడ్డి ట్రెండింగ్ లో ఉన్నాడంట.. ఇలా కాంగ్రెస్ లోనే ఉంటే.. నెమ్మదిగా ఎలాగోలా సొంత అస్తిత్వం దిశగా రేవంత్ రెడ్డి పెద్ద ప్లాన్లే వేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.