సుశాంత్ ఆత్మహత్య .. సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపణలు !

0

బాలీవుడ్ యువ హీరో వెండితెర ధోని సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. సుశాంత్ కేసులో ఇప్పటికే పలు సంచలన వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తాజాగా నేడు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్ హత్య జరిగిన రోజున దుబాయ్ కంప్లైంట్ డ్రగ్ డీలర్ అయాష్ ఖాన్ సుశాంత్ సింగ్ ను కలిశారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

అలాగే స్వామి సునంద పుష్కర్ కేసుపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సునంద పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆమె కడుపులో వెలికి చూసిన వాటితోనే నిజం ఏంటనేది తెలిసింది. కానీ శ్రీదేవి సుశాంత్ కేసులో ఇది జరగలేదు. అంతేకాక సుశాంత్ హత్య జరిగిన రోజు దుబాయ్ డ్రగ్ డీలర్ అయాష్ ఖాన్ సుశాంత్ ని ఎందుకు కలిశాడు అని స్వామి తన ట్వీట్ లో ప్రశ్నించారు. సుశాంత్ మృతితో దుబాయ్కు సంబంధాలు ఉండవచ్చని వారం రోజుల క్రితం స్వామి ఆరోపించిన సంగతి తెలిసిందే. సీబీఐ సుశాంత్ కేసుతో పాటు శ్రీదేవి సహా గతంలోని ఉన్నతస్థాయి వ్యక్తుల మరణాల కేసులను కూడా దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సుబ్రమణియన్ స్వామి ఆరోపణలు ఇప్పుడు బాలీవుడ్ లోనే కాదు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశాలుగా మారాయి. ప్రస్తుతం సుశాంత్ కేసుని సీబీఐ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇక సుశాంత్ మృతి కేసు దర్యాప్తు కోసం గత వారం ముంబై చేరుకున్న సీబీఐ బృందం నటుడి స్నేహితుడు సిద్ధార్థ్ పిథాతో పాటు నీరజ్ సింగ్ ను సోమవారం మరోసారి ప్రశ్నించింది. ముంబైలోని శాంతక్రూజ్ ప్రాంతంలోని డీఆర్ డీఓ గెస్ట్ హౌస్ వద్ద వీరిద్దరిని ప్రశ్నించారు. అంతేకాక సీబీఐ అధికారులు ఈ రోజు సుశాంత్ రెండు నెలలు బస చేసిన వాటర్ స్టోన్ రిసార్ట్ ను కూడా సందర్శించారు. అక్కడ ఉన్న సమయంలో సుశాంత్ ఎలా ప్రవర్తించాడో తెలుసుకోవడానికి సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. సీబీఐ ఈ రోజు రియా చక్రవర్తి ఆమె తండ్రి ఇంద్రజిత్ను ప్రశ్నించడానికి పిలిపించింది. చూడాలి మరి ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో