హారర్ బ్యాక్ డ్రాప్ సినిమాతో రానున్న అక్కినేని హీరో..!!

0

సెన్సిబుల్ హీరో అక్కినేని నాగ చైతన్య.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయినుగా నటిస్తోంది. వాస్తవానికి ఈ లవ్ స్టోరీ ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం కావడం ఆ వెంటనే కరోనా లాక్డౌన్ అమలులోకి రావడంతో సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు మూవీ అప్డేట్స్ అందిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తుంది మూవీటీమ్. ఇదివరకే హే పిల్ల.. అనే సాంగ్ విడుదల చేసి ప్రేక్షకులలో మంచి లవ్ ఫీలింగ్ కలిగించారు. ఫస్ట్ నుండి కూడా ఈ సినిమా గురించి వస్తున్న ప్రతి సమాచారం సినిమా పై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో నాగ చైతన్యను కాలర్ పట్టుకుని దగ్గరకు లాగుతూ.. కళ్లు మూసుకుని ప్రేమ తన్మయం పొందుతున్న పిక్ తెగ వైరల్ అవుతోంది.

ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక నాగచైతన్య గతంలో మనం వంటి అద్భుతమైన సినిమా అందించిన విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా ఓకే చేశాడు. చైతూ – విక్రమ్ కాంబినేషన్ లో మరోసారి చేయబోయే సినిమాకు ‘థాంక్ యూ’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు ప్రకటించారు. విక్రమ్ ఇంతవరకు చేసిన సినిమాలన్నిటి కంటే ఈ సినిమా కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ తయారు చేసే పనిలో పడ్డాడట డైరెక్టర్. ఇంతవరకు లవర్ బాయ్ గా మెప్పించిన నాగచైతన్య ఫస్ట్ టైమ్ ఓ హారర్ నేపథ్యంలో థాంక్ యూ సినిమా చేయనున్నాడని సమాచారం. కరోనా తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. మనం వంటి చరిత్రలో నిలిచిపోయే సినిమా తీసిన దర్శకుడు విక్రమ్ తరువాత ఆ స్థాయి హిట్ అందుకోలేదు. నిజానికి అసలు హిట్ అనేదే లేదు. కాబట్టి ఈ సినిమా ఆయన కెరీర్లో చాలా కీలకం కాబోతుంది. ఇక లవ్ స్టోరీ తర్వాత చైతూ నుండి ఈ సినిమా రాబోతుంది.