Templates by BIGtheme NET
Home >> Cinema News >> సుశాంత్ మృతి రోజు అసలేం జరిగిందంటే?

సుశాంత్ మృతి రోజు అసలేం జరిగిందంటే?


బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో సీబీఐ ఆరు బృందాలుగా విడిపోయి పలు కోణాల్లో విస్తృతంగా విచారణ జరుపుతోంది.ఈ విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఆదివారం బాంద్రాలోని నివాసంలో సుశాంత్ డెత్ సీన్ ను రీక్రియేట్ చేశారు.

తాజాగా విచారణలో సుశాంత్ చనిపోయిన జూన్ 14న ఏం జరిగిందనే దానిపై సుశాంత్ హౌస్ కీపర్ నీరజ్ సింగ్ వాంగ్మూలం సేకరించారు.‘సుశాంత్ ఉదయం 8 గంటలకు గది నుంచి బయటకు వచ్చి నీరు అడిగగా తాను తీసుకెళ్లి ఇచ్చానని.. ఆ తర్వాత నవ్వుతూ తన గదిలోకి వెళ్లారని’ నీరజ్ సింగ్ తెలిపారు.

ఆ తరువాత ఉదయం 9.30 గంటలకు తనను అరటిపండ్లు కొబ్బరి నీళ్లు జ్యూస్ తీసుకొని రమ్మని సార్ గదిలోకి వెళ్లారని.. తాను తీసుకురాగా కేవలం కొబ్బరినీళ్లు మాత్రమే సుశాంత్ తాగాడని నీరజ్ సింగ్ వాంగ్మూలంలో తెలిపాడు.

ఆ తర్వాత ఉదయం 10.30 గంటలకు గదిలోకి వెళ్లి లాక్ వేసుకున్నాడని.. పిలిచినా స్పందన లేదని వివరించాడు. ఈ విషయాన్ని కిందనున్న దీపేష్ సిద్ధార్త్ లకు చెప్పగా వారు వచ్చి డోర్ కొట్టినా స్పందన రాలేదు. సుశాంత్ ఫోన్ కు కాల్ చేసినా స్పందన రాలేదు.

ఆ తర్వాత సుశాంత్ సోదరి మీతు దీదికి ఫోన్ చేసి చెప్పామని.. ఆమె గది తలుపులు తెరవమని మాకు చెప్పారని నీరజ్ వివరించారు. ఒక తాళం తీసే వ్యక్తిని తీసుకొచ్చి ప్రయత్నించి విఫలమయ్యారని.. ఆ తర్వాత తామంతా తలుపులు పగులకొట్టి గదిలోకి ప్రవేశించామని.. సుశాంత్ సోదరి వచ్చారని.. ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడని నీరజ్ సింగ్ వివరించాడు.. పోలీసులను పిలిపించామని తెలిపారు.

అయితే సుశాంత్ హైట్ కు.. బెడ్ నుంచి హైట్ కు తేడా ఉన్నట్టు సీబీఐ గుర్తించింది. ఈ క్రమంలోనే సుశాంత్ హైట్ కూడా 5.10 ఫీట్లు మాత్రమేనని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సుశాంత్ ఉరివేసుకున్నాడా? లేదా అపస్మారక స్థితిలోకి జారుకున్న తర్వాత ఎవరైనా ఫ్యానుకు ఉరివేశారా అన్న కోణంలో సీబీఐ అధికారులు సీన్ రికన్ స్ట్రక్షన్ చేసినట్లు సమాచారం.