లాక్ డౌన్ లో రివెంజ్ పోర్న్ ఎక్కువైందట!

0

కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ మహమ్మారి సృష్టించిన విలయానికి పలువురు ఉద్యోగాలు కోల్పోగా చాలామంది ఉపాధికి దూరమయ్యారు. వేలసంఖ్యలో కంపెనీలు మూతపడే పరిస్థితి నెలకొన్నది. ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది నిరుద్యోగులయ్యారు. అయితే కరోనాతో అన్నిదేశాలు కొంతకాలంపాటు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే ఈ లాక్డౌన్తో రివెంజ్ పోర్న్ పెరిగిందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

రివెంజ్ పోర్న్ అంటే ఏమిటి..

సామాజిక మాధ్యమాల్లో తమ భాగస్వాముల వ్యక్తిగత ఫొటోలను అంటే.. వాళ్లతో సన్నిహితంగా గడిపిన ఫొటోలను షేర్ చేయడమే రివెంజ్ పోర్న్. కొందరు తాము ప్రేమించిన వారితో సన్నిహితంగా ఉంటారు. ఆ సమయంలో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు తీసుకోవడం కామనే. అయితే బ్రేకప్ చెప్పినప్పుడు – లేదా భార్యాభర్తలు విడిపోయినప్పుడు అటువంటి ఫొటోలను తొలగించడం సంస్కారం.

అయితే కొందరు సంస్కార హీనులు ఆ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ తమ మాజీ సహచరులపై కక్ష సాధిస్తుంటారు ఇదే రివేంజ్ పోర్న్.. ప్రస్తుతం ఈ తరహా రివెంజ్ పోర్న్ మనదేశంలోనూ చూస్తున్నాం. బ్రిటన్ లో ఈ తరహా నేరాలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయట. ఆదేశంలో ఇటువంటి ఘటనలపై ఈ లాక్డౌన్ పీరియడ్ లోనే 2050 ఫిర్యాదులు వచ్చాయట. గత ఏడాదితో పోల్చితే ఇది 22 శాతం ఎక్కువని అధికారులు చెబుతున్నారు. అనుమతి లేకుండా అశ్లీల చిత్రాలను పంచుకోవడం ఇంగ్లాండ్ – స్కాట్లాండ్ మరియు వేల్స్ లో చట్టవిరుద్ధం. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల రావడంతో సైబర్క్రైం పోలీసులు ఇంటర్నెట్ నుంచి 22515 ఫొటోలను డిలిట్ చేశారు.