Templates by BIGtheme NET
Home >> Telugu News >> కర్ఫ్యూలోకి వెళ్లిపోయిన మహారాష్ట్ర.. తెలుగు రాష్ట్రాల సంగతేమిటి?

కర్ఫ్యూలోకి వెళ్లిపోయిన మహారాష్ట్ర.. తెలుగు రాష్ట్రాల సంగతేమిటి?


బ్రిటన్ లో కొత్త రకం వైరస్ వెలుగు చూసిన నేపథ్యంలో పలు దేశాలు యుద్ధ ప్రాతిపదికన ముందస్తు జాగ్రత్తలతో పాటు.. ఆంక్షల కత్తిని బయటకు తీశారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు బ్రిటన్ తో రవాణా లింకును తాత్కాలికంగా తెంచేసుకున్నారు. కొన్ని దేశాలు అయితే.. ప్రయాణాలు మాత్రమే కాదు.. వస్తు సంబంధమైన రాకపోకలపైనా ఆంక్షలు విధించారు. ఇదిలా ఉంటే.. కొత్త రకం వైరస్ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

బ్రిటన్ లో వెలుగు చూసిన కొత్త వైరస్ నేపథ్యంలో దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే ముందుగా మహారాష్ట్ర ప్రభుత్వం రాత్రి వేళ కర్ఫ్యూను విధిస్తూ ప్రకటన చేసింది. ఈ రోజు (మంగళవారం) నుంచి కొత్త నిర్ణయాన్ని అమల్లోకి వస్తుందని వెల్లడించారు. మహారాష్ట్రలోని ముంబయితో సహా పలు ప్రధాన నగరాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని చెబుతున్నారు.

రాత్రిపదకొండు గంటల నుంచి ఉదయంఆరు గంటల వరకు కర్ఫ్యూను విధిస్తున్నట్లుగా పేర్కొన్నారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారు తప్పనిసరిగా పద్నాలుగు రోజులు క్వారంటైన్ లో ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. కరోనా కొత్త స్ట్రెయిన్ నేపథ్యంలో కర్ణాటకప్రభుత్వం కూడా అలెర్టు అయ్యింది. డిసెంబరు ఏడు నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రయాణికుల వివరాల్ని అందించాలని ప్రబుత్వం కోరింది.

మరి.. రెండు తెలుగు రాష్ట్రాల సంగతేమిటి? అన్న విషయంలోకి వెళితే.. తెలంగాణలో ఇప్పటికే బ్రిటన్ నుంచి వచ్చిన వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నారు. అయితే.. అది సరిపోదని.. వారి ఆరోగ్యం ఎలా ఉందన్న విషయాన్ని మరింత జాగ్రత్తగా మానిటర్ చేయాలని భావిస్తున్నారు. మహారాష్ట్రలో మాదిరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కర్ఫ్యూను విధించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఎందుకంటే.. కరోనాకొత్త రూపు మహా వేగంగా విస్తరించేప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిమితులు విధించేలా చర్యలు తీసుకోవాల్సింది. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేగంగా స్పందించాల్సిన అవసరం ఉంది.