Templates by BIGtheme NET
Home >> Telugu News >> మరిన్ని డేంజర్ వైరస్లు పొంచి ఉన్నాయి.. మానవాళి అప్రమత్తంగా ఉండాల్సిందే!

మరిన్ని డేంజర్ వైరస్లు పొంచి ఉన్నాయి.. మానవాళి అప్రమత్తంగా ఉండాల్సిందే!


ఇప్పటికే కరోనా వైరస్ సృష్టించిన అల్లకల్లోలం అవుతున్న ప్రజలకు శాస్త్రవేత్తలు మరో పిడుగు లాంటి వార్తలు చెప్పారు. రానున్న రోజుల్లో కరోనాను మించిన వైరస్లు దాడి చేసే అవకాశం ఉన్నదని హెచ్చరించారు. ఇటీవల జెనీవాలో ఇంటర్ గవర్నమెంట్ సైన్స్ పాలసీ పల్ఆట్ఫాం ఆన్ బయోడైవర్సిటీ ఎకో సిస్టమ్ ఐపీబీఎస్ వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్కషాప్ పాల్గొన్న శాస్త్రవేత్తలు రానున్న రోజులు ఎంత భయంకరంగా ఉంటాయి. మానవాళిపై అవి ఎంత ప్రభావం చూపుతాయో పూసగుచ్చినట్టు వివరించారు. ప్రపంచంలోని 22 మంది ప్రముఖ నిపుణులు ఈ సదస్సులో పాల్గొన్నారు. జీవ వైవిధ్యం మహమ్మారిపై చర్చించారు.

ప్రకృతిలో 540000 నుంచి 850000 తెలియని వైరస్లు ప్రజలకు సంక్రమిస్తాయని నివేదికలో పేర్కొన్నారు. ఫ్రెంచ్ గయానలో మాయరో వైరస్ వ్యాధి వ్యాప్తి చెందిందని డబ్ల్యూహెచ్వో నివేదించిన మూడు రోజుల తర్వాత ఈ నివేదిక రావడం గమనార్హం. కరోనా కంటే భయంకరమైన వైరస్లో భవిష్యత్లో మనుషులపై దాడిచేసే అవకాశం ఉన్నదని ఐపీబీఈఎస్ నివేదిక తెలిపింది.వైరస్ దాడుల నుంచి తప్పించుకోవడం కూడా సాధ్యమేనని సదస్సు అభిప్రాయపడింది. వన్యప్రాణులు సూక్ష్మజీవులు పశుసంపద ప్రజలమధ్య సంబంధాలు ఉండటంతో సూక్ష్మజీవులు వ్యాధులను వ్యాపింపజేస్తున్నాయని ఐపీబీఈఎస్ నివేదిక తెలిపింది. వాతావరణ మార్పు జీవవైవిధ్య నష్టానికి కారణమయ్యే మానవ కార్యకలాపాలు కూడా మహమ్మారి ప్రమాదాన్ని పెంచుతాయని నివేదిక అభిప్రాయపడింది.