కరోనా పోకముందే మరో డేంజర్ వైరస్ వచ్చేసింది… ఇది పురుషులకు మాత్రమే సోకుతుందట!

0

కరోనా వైరస్ ఎప్పుడు అంతరిస్తుందా..అని ప్రజలు ఎదురుచూస్తున్న వేళ మరో డేంజర్ వైరస్ వచ్చేస్తుంది. ఈ కొత్త వైరస్ కేవలం మగాళ్లకే సోకుతుందట. ప్రస్తుతం పురుషులకు మాత్రమే అత్యధికంగా సోకుతున్న ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ వైద్యులు గుర్తించారు. దీనికి ‘వెక్సాస్ సిండ్రోమ్’గా పేరుపెట్టారు. ఈ కొత్తవైరస్ రోజురోజుకు విస్తరిస్తన్నదని.. దీని బారినపడుతున్న పురుషుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ సోకితే ప్రాణాలకే ప్రమాదమని చెబుతున్నారు.

అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్)కి చెందిన నేషనల్ హ్యుమన్ జీనోమ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్హెచ్జీఆర్ఐ) శాస్త్రవేత్తలు ఈ కొత్త సిండ్రోమ్ ను కనుగొన్నారు. యూబీఏ 1 జన్యువులోని మ్యుటేషన్ వల్ల వచ్చే ఈ వ్యాధిని వాక్యూల్స్ ఈ1 ఎంజైమ్ ఎక్స్- లింక్డ్ ఆటో ఇన్ఫ్లమేటరీ అండ్ సోమాటిక్ సిండ్రోమ్(వెక్సాస్)గా పిలుస్తారు. ఇది పురుషులను మాత్రమే ప్రభావితం చేసే అరుదైన జన్యు వ్యాధిగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇది కేవలం X క్రోమోజోమ్ తో ముడిపడి ఉండటం వల్ల పురుషుల్లో మాత్రమే దీని ప్రభావం ఉంటుందట. మహిళల్లో ఉండే అదనపు X క్రోమోజోమ్ వారికి రక్షణగా పనిచేస్తాయని దీని వల్ల మహిళల్లో ఈ వ్యాధి సోకే అవకాశం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు.

లక్షణాలు ఏమిటి?

ఈ వ్యాధి సోకిన వారికి సిరల్లో రక్తం గడ్డకట్టడుతుంది. తరచుగా జ్వరం వస్తుంది. మైలోడెడ్ కణాల్లో వాక్యూల్స్ ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు రావడం వంటి లక్షణాలు కూడా ఉండవచ్చు. ఈ వ్యాధిని గుర్తించడానికి శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేక పద్ధతిని పాటించారు. ఈ వ్యాధి నిర్థారణకు గాను 2500 మంది రోగుల జన్యుశ్రేణులపై అధ్యయనం నిర్వహించారు. ఫలితంగా కొందరిలో యూబీఏ1 అనే జన్యువును వారిలో గుర్తించారు. ఇది వెక్సాస్ అనే ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ కు కారణమవుతుందని తేల్చి చెప్పారు. అయితే అన్ని జన్యువుల్లో 2 కాపీలుంటే దీనిలో మాత్రం ఒక్కటే కాపీ ఉందని అది కూడా ఎక్స్ క్రోమోజోమ్లో ఉంటోందని అధ్యయనానికి నేతృత్వం వహించిన మిస్టర్ డేనియల్ కాస్ట్నర్ పేర్కొన్నారు.