ఏపీ రవాణా మంత్రి.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?

0

సాక్షాత్తూ ఆయన ఏపీ రవాణా శాఖ మంత్రి. ప్రజలందరూ రూల్స్ పాటించేలా స్టిక్ట్ గా చూడాల్సిన అమాత్యులు. అలాంటిది ఆయనే హెల్మెట్ పెట్టుకోకుంటే.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? అని ఇప్పుడు ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజాగా ఏపీ మంత్రులు నిబంధనలు బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. మంత్రులు పేర్ని నాని కొడాలి నాని ఇటీవల స్కూటీపై వెళ్లడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి.

సాక్షాత్తూ ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని.. హెల్మెట్ లేకుండా బైక్ నడపడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సాధారణ ప్రజలు రూల్స్ పాటించకుంటే రూ.వేలల్లో జరిమానాలు వేస్తున్నారని.. మంత్రులకు నిబంధనలు వర్తించవా అని ప్రశ్నిస్తున్నారు.

సామాన్యులు హెల్మెట్ లేకుండా రోడ్డుపైకి వస్తే జరిమానాలు బైక్ లు సీజ్ చేస్తారని.. కానీ ఏపీ మంత్రులకు రూల్స్ పాటించకపోతే ఎలాంటి ఫైన్ లు వేయరా అని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు మంత్రులకు ఫైన్ వేయాల్సిందేనని డిమాండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది.