Templates by BIGtheme NET
Home >> Telugu News >> థాయ్ లాండ్ రాజు ప్రియురాలు నగ్న ఫొటోలు వైరల్

థాయ్ లాండ్ రాజు ప్రియురాలు నగ్న ఫొటోలు వైరల్


థాయ్ లాండ్ రాజు ప్రియురాలు నగ్న ఫొటోలు ఆన్ లైన్ లో వైరల్ కావడం ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపింది. థాయ్ లాండ్ రాజు మహా వజీరాలోంగ్ పై వ్యతిరేకతతో కొంతమంది దుండగులు అతడి ప్రియురాలు నగ్న ఫొటోలను ఆన్ లైన్ లో పెట్టడం సంచలనమైంది. రీవేంజ్ పోర్న్ పేరుతో సైనీనత్ వోంగ్వాజీరాపక్డి 1400 నగ్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వెంటనే స్పందించిన ఆ దేశ ఇంటెలిజెన్స్ అధికారులు ఆ ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

అయితే ఇంటర్ నెట్ లో ఫొటోలను తొలగించడానికి ముందే అప్పటికే థాయ్ లాండ్ రాచరికానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి ఈ నగ్న ఫొటోలను పంపించారు. 2012-14 మధ్యకాలంలో ఈ ఫొటోలు తీసినట్టుగా భావిస్తున్నారు.

ఈ ఫోటోలను బ్రిటీష్ జర్నలిస్ట్ అండ్రూ మెక్ గ్రెగర్ కూడా అందుకున్నాడు. సైనీనత్ అనుమతి లేకుండా పంపిన ఈ నగ్న ఫొటోలను పబ్లిష్ చేయవద్దని నిర్ణయించుకున్నానని బ్రిటీష్ జర్నలిస్ట్ తెలిపారు. ఈ ఫొటోలన్నీ సైనీనత్ తన సొంతంగా తీసుకున్నవేనని ఫొటోలను చూస్తే అర్థమవుతోందని తెలిపారు. రాజుకు తన నగ్న ఫొటోలు పంపడానికి ఇలా చేసి ఉంటారని ఆయన చెప్పారు.

థాయ్ లాండ్ రాజు మహా వజీరాంలోంగ్ కార్న్ 2019లో వోంగ్వాజీరాపాక్టిని తన అధికారిక చెలికత్తెగా నియమించుకున్నాడు. విదేశాల్లో పైలెట్ గా శిక్షణ పొందిన సైనినాత్ కింగ్స్ రాయల్ బాడీగార్డ్ యూనిట్ లో పనిచేసింది. మహారాజుతో సైననీత్ అక్రమ సంబంధం పెట్టుకునేందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై మహారాజు భార్య సుధీతా.. ఈ చెలికత్తెను జైలు పాలయ్యేలా చేసింది. ఇటీవలే సైననీత్ జైలు నుంచి విడుదలైంది. కొద్దిరోజులకే ఆమె నగ్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనివెనుక మహారాణి సుథీదా హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.