Templates by BIGtheme NET
Home >> Telugu News >> Corona : కరోనా నియంత్రణ: రాష్ట్రాలకు కేంద్రం లేఖ

Corona : కరోనా నియంత్రణ: రాష్ట్రాలకు కేంద్రం లేఖ


దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అదుపులోకి వస్తుండడంతో రాష్ట్రాలన్నీ అన్ లాక్ దిశగా అడుగులు వేస్తున్నాయి. పలు రాష్ట్రాలు ఇప్పుడు లాక్ డౌన్ సడలింపులు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు లేఖ రాశారు.

ఆంక్షల మినహాయింపుల అనంతరం కూడా కరోనా నియంత్రణకు 5 సూత్రాలను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. అలాగే కరోనా టెస్టుల సంఖ్యను తగ్గించకుండా కొనసాగించాలని కేంద్రహోంశాఖ కార్యదర్శి ఆదేశించారు. క్షేత్రస్తాయిలో పరిస్థితిని అంచనావేసి.. లాక్ డౌన్ సడలింపులు ఇవ్వాలని కోరారు.

పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కేంద్రఆరోగ్యశాఖ సూచించిన కరోనా నియంత్రణ చర్యలు చేపట్టాలని కేంద్ర హోంశాఖ సూచించింది. వ్యాక్సినేషన్ ద్వారా కరోనా చైన్ సిస్టంను విచ్చిన్నం చేయడం చాలా కీలకమన్న ఆయన.. ఇందుకోసం రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ను మరింత వేగవంతం చేయాలని కోరారు.

కరోనా పరిస్థితులను గమనించి కార్యకలాపాలు జాగ్రత్తగా పున: ప్రారంభించాలని కేంద్రం హోంశాఖ సూచించింది. జిల్లా సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.