Templates by BIGtheme NET
Home >> Telugu News >> అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీ.. ప్రపంచానికి షాకిచ్చిన ఇరాన్ టీవీ చానల్

అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీ.. ప్రపంచానికి షాకిచ్చిన ఇరాన్ టీవీ చానల్


ప్రపంచాన్ని షాకింగ్ కు గురి చేసే ఫోటోల్ని ఇరాన్ కు చెందిన ఒక టీవీ చానల్ బయటపెట్టింది. ప్రాశ్చాత్య దేశాలకు సరికొత్త సవాలు విసిరేలా ఈ వ్యవహారం ఉంది. ఇరాన్ లోని అండర్ గ్రౌండ్ లో ఒక మిసైల్ సిటీని ఆ దేశం సిద్ధం చేసింది. ఒక అండర్ గ్రౌండ్ లో వరుసగా ఉన్న రాకెట్లను పేర్చి ఉంచిన ఫోటోలు దడ పుట్టించేలా ఉన్నాయి. ఇరాన్ కు చెందిన ఒక టీవీ చానల్ లో ఈ క్షిపణి నగరాన్ని చూపించటంతో.. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

అయితే.. ఈ మిసైల్ సిటీ ఎక్కడ ఉందన్న విషయాన్ని ఇరాన్ వెల్లడించలేదు. చానల్ చూపించిన మిసైల్ సిటీ గురించి ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ హుస్సేన్ సలామీ స్పందిస్తూ.. తాము చూపించింది మిసైల్ సిటీలోని చిన్న భాగమేనని చెప్పారు. దాదాపు నిమిషం కంటే ఎక్కువ ఉన్న నిడివిలో..భారీగా సిద్ధం చేసిన మిసైళ్లు కనిపిస్తాయి. తన ఆయుధ సంపదను చూపించుకున్న తీరును చూస్తే.. తన శత్రు దేశాలకు స్పష్టమైన సంకేతాల్ని ఇచ్చేందుకే అన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు.

ఈ మిసైల్ సిటీలో ప్రత్యేక టెక్నాలజీ ఉందని.. శత్రు సంకేతాల్ని టైమ్లీగా గుర్తిస్తుందని పేర్కొన్నారు ప్రపంచంలో అతి పెద్ద క్షిపణి ప్రోగ్రాం ఉన్న అతి కొద్ది దేశాల్లో ఇరాన్ ఒకటిగా చెప్పాలి. 2020లో ఇరాన్ కు చెందిన అల్ కుడ్స్ ఫోర్స్ అధినేత ఖాసిమ్ సులేమానిని తాము డ్రోన్ దాడిలో అంతమొందించింది అమెరికా. అప్పటి నుంచి అమెరికాకు తగిన జవాబు చెప్పాలని ఇరాన్ భావిస్తోంది. ప్రపంచంలోని చాలా దేశాలతో పోలిస్తే.. ఇరాన్ తన దేశ రక్షణకు ఉపయోగించే టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేస్తూ ఉంటుంది. అదే స్థాయిలో ఉందన్న విషయం తాజా వీడియో ప్రపంచానికి చెప్పేసిందని చెప్పాలి.