Templates by BIGtheme NET
Home >> Cinema News >> 15 మిలియన్ వ్యూస్ తో దూసుకు పోతున్న “భగవంత్ కేసరి”

15 మిలియన్ వ్యూస్ తో దూసుకు పోతున్న “భగవంత్ కేసరి”


టాలీవుడ్ స్టార్ హీరో, నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన భగవంత్ కేసరి అక్టోబర్ 19, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయిపోయింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీ లీల, అర్జున్ రాంపాల్ లు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయగా, ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

ట్రైలర్ ఇప్పటి వరకూ 15 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. యూ ట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతూ, దూసుకు పోతుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.