Templates by BIGtheme NET
Home >> Cinema News >> “లియో” ఫస్ట్ రివ్యూ.!

“లియో” ఫస్ట్ రివ్యూ.!


ప్రస్తుతం సౌత్ ఇండియా మూవీ లవర్స్ అంతా కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కించిన చిత్రం “లియో” అనే చెప్పాలి. మరి సెన్సేషనల్ హైప్ ఉన్న ఈ చిత్రాన్ని అయితే ఆడియెన్స్ విట్నెస్ చేయాలని ఎదురు చూస్తుండగా ఈ సినిమాపై అయితే ఫస్ట్ ఎవర్ రివ్యూ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ అందిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే అనిరుద్ కి తాను వర్క్ చేసే సినిమాలు విషయంలో ఒక అలవాటు ఉంది. తాను సినిమా చూసి సోషల్ మీడియాలో జస్ట్ టైటిల్ తో కొన్ని ఫైర్ ఎమోజిస్ పెడతాడు. తాను అలా పెట్టాడు అంటే ఆ సినిమా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకోబోతుంది అని అర్ధం. గతంలో “జైలర్” “జవాన్” చిత్రాలకు కూడా అనిరుద్ ఫస్ట్ రివ్యూ అంటూ అవి ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. మరి ఇప్పుడు లియో కి కూడా అనిరుద్ తన రెస్పాన్స్ ని పోస్ట్ చేయడంతో ఇక ఇది కూడా భారీ హిట్ కాబోతోంది అని ఫిక్స్ అయ్యిపోయారు. మరి ఈ అక్టోబర్ 19న వచ్చే సినిమా ఎలా ఉంటుందో చూడాలి.