Templates by BIGtheme NET
Home >> Cinema News >> “ఇండియన్ 2” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

“ఇండియన్ 2” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!


యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో చేస్తున్న సెన్సేషనల్ సీక్వెల్ చిత్రం “ఇండియన్ 2” కోసం అందరికీ తెలిసిందే. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని శంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తుండగా ఈ సినిమాపైనే శంకర్ ఇప్పుడు అత్యున్నత సమయాన్ని వెచ్చిస్తున్నారు. దీనితో శరవేగంగా కంప్లీట్ అవుతున్న ఈ భారీ చిత్రం ఎట్టకేలకు ఫైనల్ స్టేజ్ కి చేరుకుంటున్నట్టు తెలుస్తుంది.

లేటెస్ట్ గా చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు అదిరే అప్డేట్ అందించారు. ఈ చిత్రానికి తమ లోకనాయకుడు కమల్ హాసన్ అయితే తన డబ్బింగ్ వర్క్ ని స్టార్ట్ చేసేసారు అని ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే సాలిడ్ అప్డేట్ ని అందించారు. అంటే కమల్ డబ్బింగ్ స్టార్ట్ చేసినట్టు అయితే సినిమా అయిపోవచ్చింది అనే చెప్పాలి. ఇక దీనితో రానున్న రోజుల్లో మరిన్ని పాజిటివ్ వార్తలు రానున్నాయి అని చెప్పొచ్చు.