Templates by BIGtheme NET
Home >> Cinema News >> తెలుగు మొదటి పాన్ ఇండియా మూవీకి 50 ఏళ్లు

తెలుగు మొదటి పాన్ ఇండియా మూవీకి 50 ఏళ్లు


ఈ మద్య స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకు అంతా కూడా పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు. సినిమా బడ్జెట్ పెరగడంతో పాటు తెలుగు సినిమాలకు ఉత్తరాదిన మంచి ఆధరణ ఉండటంతో ప్రతి ఒక్కరు కూడా యూనివర్శిల్ సబ్జెక్ట్ ను ఎంపిక చేసుకుని ఇక్కడ అక్కడ అన్ని చోట్ల విడుదల చేస్తున్నారు. బాహుబలి సినిమా నుండి తెలుగు సినిమాలకు ఉత్తరాధిన ఆధరణ దక్కుతుందని అంటున్నారు. కాని తెలుగులో పాన్ ఇండియా సినిమా 50 ఏళ్ల క్రితమే వచ్చిందని ప్రముఖ నిర్మాత జి ఆదిశేషగిరిరావు అన్నారు.

సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమా ఇండియాలో మొదటి కౌబాయ్ సినిమాగా నిలిచింది. నిన్నటితో ఈ సినిమా విడుదల 50 ఏళ్లు అయ్యింది. ఈ సినిమాను తెలుగులో మాత్రమే కాకుండా ఇంగ్లీష్ స్పానిష్ తమిళం బెంగాళి వంటి భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేయడం జరిగింది. ఒక మాట చెప్పాలంటే ఇది పాన్ ఇండియా మాత్రమే కాదు పాన్ వరల్డ్ మూవీ అని కూడా అనవచ్చు అంటూ అభిమానులు సోషల్ మీడియా చర్చించుకుంటున్నారు.

1971 ఆగస్టు 27వ తారీకున విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇతర భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేశాం. విడుదల అయిన ప్రతి చోట కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుందని నిర్మాత ఆదిశేషగిరి రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ ఇప్పుడు మనవాళ్లు పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు కాని అప్పట్లోనే కృష్ణ గారు ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో వెళ్లాడంటూ ఆయన పేర్కొన్నాడు. తెలుగు సినిమా చరిత్రలో మోసగాళ్లకు మోసగాడు సినిమా అలా నిలిచి పోతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.