ట్రైలర్ టాక్: సంగీతం – ప్రేమకు వారధిగా రెహమాన్ 99సాంగ్స్..!

0

ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్.. త్వరలోనే నిర్మాతగా ఆయన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఆయన నిర్మించిన ’99 సాంగ్స్’ సినిమా ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇంతకాలం సంగీత దర్శకుడుగా మాత్రమే ప్రపంచానికి తెలిసిన ఏఆర్ రెహమాన్.. ’99 సాంగ్స్’ సినిమాను నిర్మించడమే కాకుండా ఈ సినిమాకు కథను కూడా ఆయనే అందించడం విశేషం. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసింది చిత్రబృందం. ట్రైలర్ చూస్తే.. ఈ సినిమాలో జయ్ అనే పాత్రలో హీరో ఇహన్ భట్ సోఫియా పాత్రలో ఎడిల్సి వర్గాస్ కనిపించనున్నారు. అయితే జయ్ అనే హీరో క్యారెక్టర్ ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ ఎలా అయ్యాడు..? ఎలా ఈ ప్రపంచానికి తన సాంగ్స్ వినిపించాడు? అనే అంశాల చుట్టూ కథ తిరుగుతుంది.

అయితే సంగీతంతో పాటు ప్రేమ విషయంలో కూడా తంటాలు పడుతుంటాడు హీరో. ట్రైలర్ జయ్ చిన్నతనంలో ప్రారంభం అవుతుంది. సంగీతం నేర్చుకోవాలి అనుకుంటాడు కానీ తండ్రి ఒప్పుకోడు. సంగీతమే మన కుటుంబాన్ని నాశనం చేసిందని.. ఇంకెప్పుడు సంగీతం జోలికి వెళ్లనని ప్రమాణం చేయించుకుంటాడు. కానీ జయ్ పెద్దవాడు అయ్యాక అతను ప్రపంచాన్ని ఒక పాటతో మార్చవచ్చు అనే అంటాడు. ఆ పాట ఏది.. ప్రపంచానికి వినిపించాడా..? అనేది మెయిన్ కథాంశం. ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ స్క్రిప్ట్ రెడీ చేశారు. 2015 నుండి ఈ సినిమా గురించి వర్క్ చేస్తున్నాడు రెహమాన్. చివరిగా 2021లో సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాతో ఇహన్ భట్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ట్రైలర్ చూస్తుంటే హీరో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఈ సినిమాకు విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించాడు.