పంజాగుట్ట కేసు: అత్యాచార ఆరోపణలపై స్పందించిన నటుడు

0

తనపై సినీ ప్రముఖులు వారి పీఏలు ప్రజాప్రతినిధులు పోలీసులు జర్నలిస్టులు కలిసి మొత్తం 139మంది అత్యాచారం చేశారని ఓ 24 ఏళ్ల యువతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు తెలంగాణలో సంచలనమైంది. దీంతో కేసును సీసీఎస్ కు బదిలీ చేయగా వారు వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు.

కాగా ఈ కేసులో నటుడు కృష్ణుడు పేరు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ నటుడు కమెడియన్ కృష్ణుడు ఈ కేసుపై స్పందించాడు. ఆ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఈ కేసు తప్పుడు కేసుగానే తాను భావిస్తున్నట్టు తెలిపాడు. చదువుకున్న యువతికి అన్యాయం జరుగుతుంటే అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదని..11 ఏళ్లుగా ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించాడు.

సెలెబ్రెటీలను కేసులో ఇరికిస్తే కేసు తీవ్రత పెరుగుతుందనుకుంటే తప్పు అని.. ఈ కేసులో నిజనిజాలను వెలికి తీయాలని కృష్ణుడు పోలీసులను కోరాడు. ఈ ఆరోపణలు మాకు మా కుటుంబ సభ్యులను మానసికంగా ఇబ్బందులు పెడుతాయని స్పష్టం చేశారు.