సేఫ్ గా బయటపడ్డ రంగ్ దే టీమ్.. ఇదిగో చిలౌట్ ఇలా!

0

మాయదారి మహమ్మారీ మనుషుల్ని ఒక రేంజులో ఆడుకుంటోంది. ముఖ్యంగా సెలబ్రిటీల గుండెల్లో ఇటీవల రైళ్లు పరిగెట్టిస్తోంది. అదృష్టవశాత్తూ తెలుగు రాష్ట్రాల్లో రికవరీ రేటు బావుంది కాబట్టి కొంతవరకూ ఊపిరి పీల్చుకుంటున్నారే కానీ అందరి మైండ్ ని మహమ్మారీ భయంతో నింపేసింది. ఇప్పుడిప్పుడే యువతరం అలవాటు పడిపోయి ఆ మాయ నుంచి బయటపడుతున్నారు. ధైర్యం నింపుకుని ఎవరి పనుల్లో వాళ్లు పడుతున్నారు.

ఇక నితిన్.. వెంకీ అట్లూరి అండ్ ఎనర్జిటిక్ టీమ్ రంగ్ దే షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్నారు. మరో కీలక మైన షెడ్యూల్ పూర్తయ్యిందని టీమ్ వెల్లడించింది. తాజాగా చిత్ర యూనిట్ ఒక షెడ్యూల్ ను సేఫ్ గా పూర్తి చేసుకున్నామని వెల్లడించింది. దర్శకుడు వెంకీ అట్లూరి.. సితార వంశీ .. హీరోయిన్ కీర్తి సురేష్ తో కలిపి ఉన్న ఫోటోని నితిన్ షేర్ చేశారు. మొత్తానికి టీమ్ అన్ని జాగ్రత్తల నడుమ షెడ్యూల్ ని సేఫ్ గా ముగించిందని అర్థమవుతోంది.

రంగ్ దే టైటిల్ కి తగ్గట్టే ఈ మూవీని కలర్ ఫుల్ గానే వెంకీ తెరకెక్కిస్తున్నారన్నది అర్థమవుతోంది. అఆ.. భీష్మ తరహాలో మరో బంపర్ హిట్ కొట్టాలన్న పంతంతో యంగ్ టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుని ఉంటారని భావిస్తున్నారు. ఇక ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అస్సెట్ కానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకనిర్మాతలు ఈ చిత్రాన్ని సంక్రాంతి రేస్ లో నిలిపేందుకు రెడీ చేస్తున్నట్టేనా? అన్నది చెప్పాల్సి ఉంది.