డ్రగ్స్ NCB విచారణలో వెక్కి వెక్కి ఏడ్చినా అదేమీ ఎరగనట్టు..!

0

బాలీవుడ్ డ్రగ్స్ తీగ లాగితే డొంకంతా కదిలిపోయిన సంగతి తెలిసిందే. ఇందులో పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లు బయటకు రావడంతో ఎన్.సి.బి వాళ్లు విచారణ పేరుతో పిలిచారు. ఇందులో ప్రముఖ కథానాయిక దీపిక పదుకొనే కూడా ఉండడం అభిమానులను కలవరపరిచింది. దీపికను ఎన్.సి.బి వాళ్లు పదే పదే డ్రగ్స్ లింకుల గురించి ప్రశ్నిస్తుంటే కనీసం మూడు సార్లు కంట తడి పెట్టుకుందని వెక్కి వెక్కి ఏడ్చేసిందని జాతీయ మీడియా కథనాలు అల్లింది.

అది నిజమా కాదా? అన్నది అటుంచితే.. దీపిక ను ఎన్.సి.బి వాళ్లు పిలిపించినప్పుడు గోవాలో ఓ సినిమా షూటింగులో ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డ్రగ్ నెక్సస్పై ఎన్.సిబి దర్యాప్తులో తొలుత దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాష్ దొరికిపోవడం.. అటుపై దీపికను విచారించడం తెలిసినదే. ఎట్టకేలకు విచారణ పూర్తయ్యాక దీపిక తిరిగి షూటింగులకు ఎటెండయ్యింది.

తాజా సమాచారం ప్రకారం..సిద్ధాంత్ చతుర్వేది -అనన్య పాండే కలిసి నటించిన షకున్ బాత్రా చిత్రంలో దీపిక ఓ అతిథి పాత్రను పోషిస్తోందట. అక్కడికి దీపిక వెళుతోంది. ఇక ఎన్.సిబి విచారణ కోసం దీపికా పదుకొనే ముంబైకి వెళ్లగా.. ఈ గ్యాప్ లో అనన్య – సిద్ధాంత్ పార్ట్ ను మేకర్స్ చిత్రీకరించారని సోర్సెస్ ద్వారా తెలిసింది.

దీపిక ఇతర ప్రాజెక్టుల సంగతి చూస్తే.. చివరిసారిగా ఛపాక్ చిత్రంలో నటించింది. ఇందులో ఆమె యాసిడ్ అటాక్ కి గురైన మహిళగా నటించింది. ప్రాణాలతో బయటపడిన మాల్టి అనే యువతి పాత్రలో నటించింది. తరువాత షకున్ బాత్రా తదుపరి ప్రాజెక్ట్ లో అనన్య పాండే – సిద్ధాంత్ చతుర్వేదిలతో కలిసి కనిపిస్తుంది. అలాగే రణవీర్ సింగ్ – తాహిర్ రాజ్ భాసిన్- అమ్మీ విర్క్ తదితరులు నటించిన స్పోర్ట్స్ డ్రామా `83` విడుదల కోసం దీపిక ఎదురుచూస్తోంది. ఇందులో నటించడమే గాక సహ నిర్మాతగానూ దీపిక వ్యవహరించిన విషయం తెలిసినదే.