Templates by BIGtheme NET
Home >> Cinema News >> ప్రభాస్ సలార్.. శృతి కామెంట్స్ అర్ధం ఏంటి..?

ప్రభాస్ సలార్.. శృతి కామెంట్స్ అర్ధం ఏంటి..?


రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సినిమా సలార్. రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమాను హోంబలే ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తుంది. సలార్ పార్ట్ 1 డిసెంబర్ 22న రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమా గురించి లేటెస్ట్ ఇంటర్వ్యూలో శృతి హాసన్ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ కి షాక్ ఇస్తున్నాయి. సలార్ సినిమా గురించి శృతి హాసన్ అది ప్రభాస్ సినిమా అని చెప్పింది. అదేంటి అందులో శృతి హాసన్ కూడా ఉంది కదా అనుకోవచ్చు. ప్రభాస్ సలార్ సినిమాలో తాను నటిస్తున్నాను కానీ అది పూర్తిగా ప్రభాస్ సినిమా అని చెప్పింది.

ప్రభాస్ ఎంతో కష్టపడి తన కెరీర్ బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు. ప్రశాంత్ నీల్ తన పంథాలో తను సినిమాలు చేస్తున్నారు. ఈ ఇద్దరు కలిసి చేసిన సలార్ లో తాను నటించా అంతే అంటూ ఆన్సర్ ఇచ్చింది శృతి హాసన్. అయితే సలార్ ప్రభాస్ సినిమా అనడంలో శృతి పాజిటివ్ గానే స్పందించిందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఎందుకంటే సినిమాలో హీరోయిన్ ఎంత ఇంపార్టెంట్ అయినా టికెట్స్ తెగాలంటే మాత్రం అది హీరోల వల్లే అవుతుంది.

హీరోల ఇమేజ్ అందుకు తగిన బజ్ ఇవన్నీ ఒక సినిమా బిజినెస్ కు కారణం అవుతాయి. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్స్ కొన్నిసార్లు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనిపిస్తారు. కొన్నిసార్లు కేవలం పాటలు, గ్లామర్ కోసమే అన్నట్టు ఉంటారు. అయితే శృతి హాసన్ మాత్రం సలార్ లో కేవలం పాటల కోసమే అనే ఆలోచన అయితే లేదు. కె.జి.ఎఫ్ సినిమాతో శ్రీనిధి శెట్టికి లైఫ్ ఇచ్చినట్టుగా తప్పకుండా శృతి హాసన్ కి కూడా సలార్ తో మరింత క్రేజ్ వచ్చేలా చేస్తాడని నమ్ముతున్నారు.

ఈ ఇయర్ వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి రెండు సినిమాలతో హిట్ అందుకున్న శృతి హాసన్ సెలెక్టెడ్ సినిమాలు చేస్తుంది. సలార్ లో తన పాత్ర ఏంటన్నది ఇంకా రివీల్ కాలేదు. అయితే సలార్ తో శృతి హాసన్ కెరీర్ మైలేజ్ మాత్రం పెరుగుతుందని చెప్పొచ్చు. సలార్ పార్ట్ 1 డిసెంబర్ కి రిలీజ్ లాక్ చేస్తుండగా పార్ట్ 2 ని 2026 లోనే రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నట్టు తెలుస్తుంది.