Templates by BIGtheme NET
Home >> Cinema News >> పిచ్చేక్కిస్తున్న బాద్‌షా వారసురాలు

పిచ్చేక్కిస్తున్న బాద్‌షా వారసురాలు


బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ వారసులు తెరంగేట్రం కి సిద్ధం అవుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే తనయుడు ఫిల్మ్‌ మేకింగ్‌ పై దృష్టి పెట్టింది. మరో వైపు షారుఖ్‌ కూతురు లేడీ బాద్‌షా గా పేరు దక్కించుకున్న సుహన ఖాన్ కూడా తెరంగేట్రం కి రెడీ అవుతున్న నేపథ్యంలో సోషల్‌ మీడియాలో సందడి పెరిగింది.

స్టార్ కిడ్‌ అవ్వడం వల్ల సుహన ఖాన్‌ కి మొదటి నుంచి కూడా భారీగా సోషల్ మీడియా ఫాలోయింగ్‌ ఉంది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఆమె ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతుంది కనుక ఆ ఫాలోయింగ్ మరింత పెరిగింది. తన ఫాలోవర్స్ కి కన్నుల విందు చేస్తూ వినోదాన్ని పంచడానికి గాను అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంది.

తాజాగా మరోసారి సుహన ఖాన్‌ తన అందమైన ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో సింపుల్‌ అండ్ స్వీట్ లుక్ లో సుహాన కనిపించింది. టాప్ లెస్ అందాలతో ముద్దుగుమ్మ అందమైన పిక్స్ ని షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ రేంజ్ లో అందంగా కనిపిస్తే తప్పకుండా బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్ అవ్వడం ఖాయం. ఇప్పటికే ఈమె ది ఆర్చీస్ అనే సినిమా కోసం వర్క్‌ చేస్తోంది. ఆ సినిమా తర్వాత ముందు ముందు సుహన మరింత బిజీ అయ్యే అవకాశాలు లేకపోలేదు అంటూ బాలీవుడ్‌ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి లేడీ బాద్‌ షా సుహన ఖాన్‌ కచ్చితంగా ఈ అందంతో బాలీవుడ్‌ లో జెండా పాతడం ఖాయం.