Templates by BIGtheme NET
Home >> Cinema News >> తట్టుకోలేనంత ద్వేషాన్ని చూశాను!- ఆలియా

తట్టుకోలేనంత ద్వేషాన్ని చూశాను!- ఆలియా


యువహీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానంతరం పరిశ్రమ ఇన్ సైడర్ అయిన అలియాపై సోషల్ మీడియాలో ద్వేషపూరిత కామెంట్లు బెదిరింపులు ఎదురయ్యాయి. ఔట్ సైడర్ పై ఇన్ సైడర్స్ కుట్రలు చేస్తారంటూ ..సుశాంత్ అభిమానులు ఆలియా లాంటి నటవారసులపై దునుమాడారు. బాలీవుడ్ లో సుశాంత్ వంటి బయటి వ్యక్తులను తమ హక్కులను పొందడానికి ‘స్టార్ల పిల్లలను’ లక్ష్యంగా చేసుకున్నారు. అలియాతో పాటు.. అనన్య పాండే.. కరీనా కపూర్.. సారా అలీ ఖాన్ వంటి తారలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. అలియా సోదరి షాహీన్ నెటిజనుల దురాగతాలను తీవ్రమైన వ్యాఖ్యానాల్ని స్క్రీన్ షాట్ల రూపంలో బహిరంగంగా పంచుకున్నారు.

అయితే దీనికి ఆలియా చాలా తీవ్రంగా కలత చెందడమే గాక ఒకానొక సందర్భంలో ఎంతో ఎమోషన్ అయ్యారు. తాజాగా మరోసారి నాటి పరిణామాన్ని తలుచుకున్నారు. అలియా భట్ తాను ‘చాలా ద్వేషాన్ని’ చవి చూశానని.. ప్రజలు ఒకరి పట్ల ఒకరు దయతో ఉండాలని.. ఈ భూగ్రహం పట్ల దయ చూపాలని కోరుకుంటున్నాను అన్నారు. తాను ద్వేషాన్ని కాకుండా దయను కలిగి ఉండి దానినే విశ్వమంతా వ్యాప్తి చేయాలనుకుంటున్నానని అంది. అలియా భట్ బట్టల రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించారు. ఈ కొత్త వెంచర్ గురించి మాట్లాడుతూ తనపై ట్రోలింగ్ ద్వేషాలపైనా మాట్లాడారు ఆలియా. ప్రపంచంలో మరింత దయను వ్యాప్తి చేయడానికి ఇదంతా తనను ప్రేరేపించిందట.
ఆలియా పిల్లల కోసం తనదైన శైలి బట్టల బ్రాండ్లను ప్రోత్సహిస్తోంది – ఎడ్-ఎ-మమ్మా వ్యవస్థాపకురాలిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది.

కెరీర్ మ్యాటర్ చూస్తే.. అలియా చివరిసారిగా సడక్ 2 లో కనిపించింది. సంజయ్ దత్- పూజా భట్ -ఆదిత్య రాయ్ కపూర్ లతో కలిసి నటించింది. ఈ చిత్రానికి మంచి సమీక్షలు రాలేదు. ప్రేక్షకుల నుంచి సరైన స్పందన రాలేదు. తదుపరి బ్రహ్మాస్త్రా- ఆర్.ఆర్.ఆర్ .. గంగూబాయి కతియావాడిలలో ఆలియా కనిపిస్తుంది.