Templates by BIGtheme NET
Home >> Cinema News >> Alia Calendar Pic : క్యాలెండర్ గాళ్ ఆలియా స్ట్రైకింగ్ ఫోజ్

Alia Calendar Pic : క్యాలెండర్ గాళ్ ఆలియా స్ట్రైకింగ్ ఫోజ్


వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఆలియాభట్ కెరీర్ పరంగా క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్న సంగతి తెలిసందే. ఆర్.ఆర్.ఆర్ – గంగూభాయి కతియావాడీ- బ్రహ్మాస్త్ర లాంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాల్లోనూ ఈ బ్యూటీ ఎంతో జోరు మీదున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కోవిడ్ నుంచి కోలుకున్న అనంతరం తిరిగి తన మునుపటి రూపానికి మారడానికి కొంత సమయం పట్టింది.

తాజాగా డబూ రత్నానీ క్యాలెండర్ షూట్ తో అభిమానుల ముందుకు వచ్చింది. ఇప్పటికే డబూ రత్నానీ క్యాలెండర్ గాళ్స్ గా పలువురు భామలు మెరిపించారు. ఆలియా నీలి రంగు డిజైనర్ డ్రెస్ లో తళుకుబెళుకులు ప్రదర్శిస్తున్న ఫోజ్ అంతే వైరల్ గా మారింది. ఆలియా సింపుల్ గా కనిపిస్తున్నా స్ట్రైకింగ్ గా ఉందంటూ ఈ ఫోటోకి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజా సమాచారం మేరకు.. ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్ పేరుతో ఇటీవలే తన సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన అలియా భట్ ఈ బ్యానర్ లో డార్లింగ్స్ అనే మూవీని నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని షారుఖ్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ తో కలిసి ఆలియా నిర్మిస్తుంది. ఈ చిత్రంలో షెఫాలి షా- రోషన్ మాథ్యూ – అలియా భట్ -గల్లీ బాయ్ సహనటుడు విజయ్ వర్మ కూడా నటించనున్నారు. డార్క్ కామెడీ జానర్ లో డార్లింగ్స్ తెరకెక్కనుంది.