ఫ్యాన్స్ ని స్పెల్ బౌండ్ చేసే బన్ని ఫ్యామిలీ పిక్చర్

0

పండగల వేళ అల్లు వారి సెలబ్రేషన్ మూడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. కుటుంబ సమేతంగా పండగను ఆస్వాధిస్తారు. అందుకు సంబంధించిన దృశ్యాలు అభిమానులకు కన్నుల పండుగను తెస్తాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అతని కుటుంబం తమ ఇంటిలోనే ఈసారి దసరాను జరుపుకున్నారు. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా… అల్లు అర్జున్ ఈ సీజన్ లో హైదరాబాద్ విడిచి వెళ్లలేదు.

ప్రతి సంవత్సరం బన్ని దసరా జరుపుకోవడానికి తన భార్య స్నేహ సొంత గ్రామానికి వెళతాడు. కానీ ఈసారి వారు హైదరాబాద్ లోని నివాసంలోనే ఉన్నారు. ఇంట్లో విజయదశమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. అందుకు సంబంధించిన ఫోటోల్ని ఈ జంట సోషల్ మీడియాలో రివీల్ చేశారు.

బన్ని- స్నేహ జంట తమ అభిమానులు అనుచరులందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బన్ని తన కుటుంబ సమేతంగా దిగిన ఫోటోను కూడా పంచుకున్నాడు. భార్య స్నేహ .. ఇద్దరు పిల్లలు – అర్హా మరియు అయాన్ అందరూ పండుగ సందర్భంగా సాంప్రదాయ దుస్తులను ధరించారు. అల్లు అర్జున్ గతేడాది లాంచ్ అయిన ‘పుష్ప’ రెగ్యులర్ షూట్ ను ఇంకా ప్రారంభించలేదు. సుకుమార్ ఈ యాక్షన్ డ్రామాకు దర్శకత్వం వహించనున్నారు. రష్మిక మందన కథానాయికగా నటిస్తోంది. త్వరలోనే సెట్స్ కెళ్లేందుకు సన్నాహకాల్లో ఉన్నారన్న సమాచారం ఉంది.