డ్రగ్స్ కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టబడ్డ టీవీ నటి

0

ముంబై డ్రగ్స్ కు అడ్డా అని మరోసారి రుజువైంది. ఇప్పటికే సుశాంత్ సింగ్ కేసులో తీవ్రంగా విమర్శలపాలైన బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి మరో షాక్ తగిలింది. ఈసారి తాజాగా ప్రముఖ టీవీ నటి ప్రీతికా చౌహాన్ డ్రగ్స్ కొనుగోలు చేస్తూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం కలకలం రేపింది.

పోలీసులకు అందిన సమాచారం ప్రకారం ముంబైలోని వెర్సోవా ప్రాంతానికి సాధారణ దుస్తుల్లో వెళ్లిన అధికారులు.. అక్కడ ఓ వ్యక్తి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న ప్రీతికా అనే టీవీ నటిని రెడ్ హ్యాండెడె గా పట్టుకొని అరెస్ట్ చేశారు.

వెర్సోవాలోని మచ్చిమార్ ప్రాంతంలో శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో ‘ఫైజల్’ అనే 20 ఏళ్ల యువకుడి నుంచి ప్రీతికా డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా ప్రీతికాను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 99 గ్రాముల గంజాయితోపాటు మారిజునా మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ డ్రగ్స్ కొనుగోలు అమ్మకంలో మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు ముంబై అధికారులు. దీపక్ రాథౌర్ అనే వ్యక్తిని కూడా పోలీసులు తర్వాత అరెస్ట్ చేశారు. రాథౌర్ రౌడీషీటర్ అని తెలిసింది. రాథౌర్ వెర్సోవా ప్రాంతంలో చాలా మంది హైప్రొఫైల్ వ్యక్తులకు చాలాకాలంగా రాథౌర్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ముంబైలోని కిల్లా కోర్టులో వీరిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ప్రీతికా ప్రస్తుతం హిందీలోని ప్రముఖ సీరియళ్లు అయిన సావధాన్ దేవోకే దేవ్ మహారాజ్ లలో నటిస్తోంది. ఆమె డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో ముంబై మరోసారి ఉలిక్కిపడింది. సుశాంత్ కేసులో జరిగిన రచ్చ నేపథ్యంలో మరోసారి ప్రీతికా అరెస్ట్ తో బాలీవుడ్ ఉలిక్కిపడింది.