బిబి4 : ఎనిమిది వారాల తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏంటి బాసూ?

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 కు రేటింగ్ మొదటి ఒకటి రెండు వారాలు మంచి రేటింగ్ వచ్చినా ఆ తర్వాత తర్వాత రేటింగ్ దారుణంగా పడిపోయింది అనేది బుల్లి తెర వర్గాల వారి టాక్. బిగ్ బాస్ నిర్వాహకులు రేటింగ్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సఫలం అవ్వలేక పోతున్నారు. మొన్నటి ఆదివారం సమంతను గెస్ట్ హోస్ట్ గా తీసుకు వచ్చి ఏకంగా మూడు గంటల పాటు మారథాన్ ఎపిసోడ్ ను నిర్వహించారు. ఆ ఎపిసోడ్ కు కూడా జస్ట్ ఓకే అన్నట్లుగానే మార్కులు పడ్డాయి. మళ్లీ వీక్ డేస్ లో రేటింగ్ వీక్ గానే వస్తున్నట్లుగా సమాచారం. షో లో వాతావరణంను మార్చేందుకు నిర్వాహకులు మరో వైల్డ్ ఎంట్రీని ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది.

గత కొన్ని రోజులుగా గాయిని మంగ్లీని వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి పంపించాలని భావిస్తున్నారట. ఇప్పటికే ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు జరిగాయి. ఆ మూడు వైల్డ్ కార్డ్ ల్లో స్వాతి మరియు కుమార్ సాయిలు వచ్చేశారు. ఇప్పుడు నాల్గవ ఎంట్రీకి రెడీ చేస్తున్నారు. మంగ్లీకి మంచి క్రేజ్ ఉంది. ఆమె ఎంట్రీతో ఖచ్చితంగా షోకు అదనపు ఆకర్షణ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆమెను హౌస్ లోకి పంపించేందుకు నిర్వాహకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ప్రచారం. ఆమెకు భారీ పారితోషికం ఆఫర్ చేశారని ఆమె ఒప్పుకుందనే వార్తలు కూడా వస్తున్నాయి.

గత వారం రోజులుగా మంగ్లీ క్వారెంటైన్ లో ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తానికి ఎనిమిదవ వారంలో లేదా ఎనిమిది వారాల తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇది ఏమాత్రం ఆటలో సబబు కాదు. ఇన్ని వారాల తర్వాత ఎంట్రీ ఇచ్చే మంగ్లీకి అక్కడ పరిస్థితులు ఏమాత్రం సెట్ అవ్వక పోవచ్చు అంటున్నారు. మంగ్లీకి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఆమెను ఆటలో జొప్పించడం బాగానే ఉన్నా ఇన్ని వారాల తర్వాత ఆమెను పంపించడం అనేది ఫెయిర్ గేమ్ కాదంటున్నారు. ఈ వార్తలు ఎంత వరకు నిజము అనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒక వేళ మంగ్లీ హౌస్ లోకి వెళ్తే ఆమెకు ఇంటి సభ్యుల నుండి ఎలాంటి వెల్ కమ్ దక్కుతుంది అనేది కూడా ఆసక్తికర విషయం.