క్రేజ్ ని బట్టి ముద్దుగుమ్మ రెమ్యూనరేషన్..!

0

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకిగా వెలుగొందుతోంది పూజా హెగ్డే. టాలీవుడ్ లో వరుస అవకాశాలతో వరుస విజయాలతో దూసుకుపోతోంది. ‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగు తెరకు పరిచమైన ఈ భామ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. ‘దువ్వాడ జగన్నాథమ్’ చిత్రంతో తనలోని మరో కోణాన్ని బయటపెట్టి తొలి సూపర్ హిట్ అందుకుంది పూజా. ఇదే క్రమంలో బాలీవుడ్ లో ‘మెహంజదారో’ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా ప్లాప్ అవడంతో బాలీవుడ్ ఫిలిం మేకర్స్ పూజా కు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే తెలుగులో మాత్రం స్టార్ హీరోల పక్కన నటించే ఛాన్సులు కొట్టేస్తూ రెమ్యూనరేషన్ పెంచుకుంటూ వచ్చింది. ‘అరవింద సమేత వీర రాఘవ’ ‘మహర్షి’ సినిమాతో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది.

ఈ నేపథ్యంలో బాలీవుడ్ మళ్ళీ పూజా హెగ్డే వైపు చూసింది. ‘హౌస్ ఫుల్ 4’ తో సక్సెస్ అందుకుని అక్కడ కూడా లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. ఇక ఈ ఏడాది ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో మరో హిట్ కొట్టి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. స్టార్ హీరోల సరసన నటించేందుకు ఏకైక ఛాయిస్ గా మారిపోయిన ఈ బుట్టబొమ్మ డేట్స్ కూడా చాలా కాస్ట్లీ అయ్యాయని తెలుస్తోంది. హిందీలో ఇటీవల రణవీర్ సింగ్ – రోహిత్ శెట్టి ప్రాజెక్ట్ కి సైన్ చేసిన పూజా హెగ్డే.. ఈ చిత్రం కోసం సుమారు 2.5 – 3 కోట్ల వరకు తీసుకుంటుందట. ఇంతకముందు సినిమాకి 2 కోట్ల లోపే తీసుకునే పూజా ‘అల..’తో వచ్చిన క్రేజ్ కు తగ్గట్టే డిమాండ్ చేస్తోందట. అయినా సరే అమ్మడి డేట్స్ కోసం స్టార్ హీరోలు సైతం వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. పూజా హెగ్డే ప్రస్తుతం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో ‘రాధే శ్యామ్’ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తుంది. అలాగే అక్కినేని అఖిల్ సరసన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.