మరో సూపర్ ఛాన్స్ దక్కించుకున్న అంజలి

0

తెలుగమ్మాయి అంజలి మొదట తమిళంలో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగులో డబ్బింగ్ సినిమాలతో ఆధరణ దక్కించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్ మూవీలో కీలక పాత్రలో కనిపించబోతుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు వరుసగా కమర్షియల్ ఎంటర్ టైనర్ లను కూడా చేస్తున్న అంజలికి కన్నడంలో మరో సూపర్ స్టార్ ఆఫర్ దక్కింది. ఇప్పటికే కన్నడంలో ఈమె మంచి హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది.

తాజాగా ఈమెకు కన్నడ సెన్షేషనల్ స్టార్ శివరాజ్ కుమార్ తో నటించే అవకాశం దక్కంది. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న శివప్ప మూవీలో అంజలి హీరోయిన్ గా నటస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. వచ్చే నెలలో అంజలి శివప్ప సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గతంలో అంజలి పునీత్ రాజ్ కుమార్ కు జోడీగా నటించ సక్సెస్ అయిన ఈ అమ్మడు ఈసారి శివరాజ్ కుమార్ తో నటిస్తోంది. ఈ సినిమా తో మరో విజయాన్ని ఈమె దక్కించుకుంటుందేమో చూడాలి.