టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ఫేం కిల్ల‌ర్ లుక్


అందాల పోటీల విజేత‌గా అనుక్రితి వాస్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 2021 మిస్ ఇండియా కిరీటం సొంతం చేసుకున్న అనూ క‌థానాయిక‌గా పెద్ద రేంజ్ కెరీర్ ని ఆశిస్తోంది. ఇటీవ‌లే టాలీవుడ్ అగ్ర హీరో ర‌వితేజ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు చిత్రంలో జ‌య‌వాణి అనే పాత్ర‌లో న‌టించింది. అనుకృతి న‌ట‌న‌, హాట్ లుక్స్ కి యువ‌త‌రం ఫిదా అయిపోయారు.

ఇటీవ‌లే అనుకీర్తి వాస్ VJS46 తారాగణంలో చేరారు. విజయ్ సేతుపతి.. దర్శకుడు పొన్‌రామ్‌తో చేస్తున్న‌ తదుపరి చిత్రం VJS46 లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2018 విజేత అనుక్రీతి వాస్ కథానాయికగా నటిస్తుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం దిండిగల్ నేపథ్యంలో సాగే కామెడీ, లవ్ యాక్షన్‌తో కూడిన గ్రామీణ మసాలా ఎంటర్‌టైనర్‌. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి పోలీస్ పాత్రలో నటించనున్నాడు. దీనికి డి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. మ‌రోవైపు అనుకీర్తి వాస్ ముగేన్ రావు సరసన ‘వెట్రీ’ చిత్రంలోను న‌టిస్తోంది. నరేన్, ఆనంది, కతిర్ నటించిన జాక్ హారిస్ చిత్రంలో కూడా అనూ కనిపించనుంది.

ఈ మాజీ మిస్సు సోష‌ల్ మీడియాల్లోను చాలా స్పీడ్ మీద ఉంది. తాజాగా అనుకృతి షేర్ చేసిన హాట్ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో అగ్గి రాజేస్తోంది. పాక్షికంగా ఇన్న‌ర్ అందాల‌ను ఎలివేట్ చేసే పార‌ద‌ర్శ‌క డ్రెస్ లో అనూ కీర్తి క‌నిపించింది. ఈ ఫోటోగ్రాఫ్స్ ని వీక్షించాక‌.. నెటిజ‌నుల్లో జోరుగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒక అభిమాని వ్యాఖ్యానిస్తూ .. యాడెడ్ టు మై ప‌ర్స‌న‌ల్ క్ర‌ష్ లిస్ట్ అని వ్యాఖ్య‌ను జోడించాడు.