Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఆఫర్స్ లేకనా ఈ అమ్మడి కైపెక్కించే పోజు..!

ఆఫర్స్ లేకనా ఈ అమ్మడి కైపెక్కించే పోజు..!


మజ్ను మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ అమ్మడు ఫస్ట్ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. స్వప్నసంచారి అనే మల్లువుడ్ మూవీతో కెరీర్ ప్రారంభించిన అను.. ‘యాక్షన్ హీరో బిజు’ సినిమాతో హీరోయిన్ గా మారింది. 2016లో నేచురల్ స్టార్ నానితో ‘మజ్ను’ సినిమా చేసి తెలుగులో అడుగుపెట్టింది. ఆ సినిమాలో పక్కింటి అమ్మాయిలా క్యూటుగా కుర్రకారు మనసు దోచేసుకుంది. 19ఏళ్లకే హీరోయిన్ అయిన అమ్మడు తన అందమైన కళ్లతో.. కొంటె సైగలతో సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇప్పటికి అను చేసిన సినిమాల సంఖ్య వేళ్ల మీద లెక్కేయొచ్చు. మజ్ను తర్వాత కిట్టు ఉన్నాడు జాగ్రత్త ఆక్సిజన్ అజ్ఞాతవాసి నా పేరు సూర్య శైలజ రెడ్డి అల్లుడు ఇలా వరుసగా సినిమాలు చేసింది కానీ అన్ని ప్లాప్స్ గానే మిగిలిపోయాయి.

లాభం లేదని ‘నమ్మ వీట్టు పిళ్ళై’ సినిమాతో తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. హిట్టో ప్లాపో తెలియదుగాని ఆ మూవీ తర్వాత పూర్తిగా కెమెరాకు దూరమైంది. ప్రస్తుతం అను చేతిలో 18పేజెస్ మహాసముద్రం సినిమాలు ఉన్నాయట. అయితే సోషల్ మీడియాలో అనుకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాత్రం బాగానే మెయింటైన్ చేస్తోంది. అయితే ఆక్సిజన్ నా పేరు సూర్య సినిమాలలో గ్లామరస్ గా కనిపించింది. అమ్మడు ఇంస్టాగ్రామ్ వేదికగా తన వయ్యారాల పిక్స్ పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల ఆకలి తీర్చుతుంది. తాజాగా అను బ్లాక్ డ్రెస్ ధరించి చేతిలో స్క్రిప్ట్ పట్టుకొని చదువుతున్న ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటోలో అను ఎంతో శ్రద్ధగా చదువుతున్నట్లు కనిపిస్తుంది. అన్నట్లు అను ప్యాంటు వేసుకోవడం మర్చిపోయినట్లుంది. చూస్తున్న కుర్రాళ్లంతా వేడెక్కిపోతున్నారు. మరి సినిమా ఆఫర్స్ లేకే ఇలా వయ్యారాలు ఒలికిస్తుందా.. అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. చేతిలో స్క్రిప్ట్.. కుర్రాళ్ల చూపు థైస్ వైపు అన్నట్లుగా మారింది చందం.