Templates by BIGtheme NET
Home >> Cinema News >> భీమవరం లోకల్ బ్యూటీకి బాగానే ఆఫర్స్ వస్తున్నాయిగా..!

భీమవరం లోకల్ బ్యూటీకి బాగానే ఆఫర్స్ వస్తున్నాయిగా..!


‘ఉండిపోరాదే’ సినిమాతో ఆ మధ్య అందరి దృష్టిని ఆకర్షించిన భీమవరం అమ్మాయి అనువర్ణకి ఇప్పుడు హీరోయిన్ గా బాగానే ఆఫర్లు వస్తున్నాయి. ఈ సినిమా తర్వాత అనువర్ణ మరో రెండు తెలుగు సినిమాలలో నటించినా అవి ఇంకా విడుదల కాలేదు. ఈ క్రమంలో లేటెస్టుగా నాలుగో సినిమా ఆఫర్ దక్కించుకుంది ఈ లోకల్ బ్యూటీ. కన్నడ హీరో శశికుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ హీరోగా నటిస్తోన్న ”సమిధ” అనే చిత్రంలో అనువర్ణ ఛాన్స్ కొట్టేసింది. తమిళ నటి చాందిని మరో హీరోయిన్ గా నటిస్తోంది. రాజస్థాన్ లో జరిగిన ఒక యదార్ధ గాథని ఇన్స్పిరేషన్ గా తీసుకుని అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ని రూపొందించనున్నారు.

తెలుగు తమిళ కన్నడ భాషలలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో సతీష్ మాలెంపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సతీష్ ఇంతకముందు ‘మర్మం’ ‘కనులు కలిసాయి’ లాంటి ఐదు షార్ట్ ఫిలిమ్స్ రూపొందించాడు. అరుణం ఫిలింస్ నిర్మిస్తోన్న ఈ మూవీని హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. డిసెంబర్ 8 నుండి ‘సమిధ’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో రవివర్మ – పోసాని కృష్ణ మురళి – శ్రావణ్ – రవికాలే – బ్లాక్ పాండీ – కేపివై బాలా – శంకర్ మూర్తి తదితరులు నటిస్తున్నారు.