Templates by BIGtheme NET
Home >> Cinema News >> కత్రిన నటించు.. సూపర్ హీరో మూవీ టైటిల్ ఇదే

కత్రిన నటించు.. సూపర్ హీరో మూవీ టైటిల్ ఇదే


ఇండియాలోనే తొలి నాయికా ప్రధాన సూపర్ హీరో మూవీ టైటిల్ ప్రకటించారు. కత్రిన కైఫ్ సూపర్ హీరో చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ సూపర్ సోల్జర్ అని పేరు పెట్టారు. మహిళా స్టార్ నటిస్తున్న బాలీవుడ్ తొలి సూపర్ హీరో చిత్రం ఇది. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది.

ఈ ఏడాది సెప్టెంబరులో అలీ అబ్బాస్ జాఫర్ ఈ మూవీ కోసం లొకేషన్లను ఖరారు చేయడానికి ముందు రీసెర్చ్ లో భాగంగా దుబాయ్ వెళ్ళారు. ఈ చిత్రం షూటింగ్ కోసం అబుదబి- దుబాయ్- పోలాండ్- జార్జియా- ఉత్తరాఖండ్ లను మేకర్స్ ఖరారు చేశారు.

అంతకుముందు ఒక దినపత్రికతో మాట్లాడుతూ.. కత్రిన కైఫ్ సరసన ఈ చిత్రానికి కథానాయకుడి అవసరం లేదని అలీ వెల్లడించారు. ఆమె ఈ చిత్రానికి హీరో అని ఇందులో ఎలాంటి రొమాంటిక్ ట్రాక్ ఉండదని ఆయన అన్నారు. కత్రిన మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పూర్తయితే సెట్స్ కెళతామని వెల్లడించారు. కత్రిన చిత్రీకరణకు వెళ్ళే ముందు చాలా ప్రిపరేషన్ చేయనుందని తెలిపారు.

కత్రినా కైఫ్ మరోవైపు రెండు చిత్రాలతో బిజీ. ఫోన్ భూత్ – టైగర్ 3 ని పూర్తి చేసిన తర్వాత వచ్చే ఏడాది `సూపర్ సోల్జర్`ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ చిత్రం కోసం కత్రిన భారీగా షెడ్యూల్స్ కేటాయిస్తుంది. కత్రినా కైఫ్ ఇప్పటికే సూపర్ సోల్జర్ కోసం పని ప్రారంభించింది. ఈ చిత్రానికి తేదీలు కేటాయించిన తర్వాత ఆమె శిక్షణ ప్రారంభిస్తుంది.

కత్రినా కైఫ్- అలీ అబ్బాస్ జాఫర్ జోడీ మూడోసారి కలిసి పనిచేయనున్నారు. వారు ఇంతకుముందు `మేరే బ్రదర్ కి దుల్హాన్` .. టైగర్ జిందా హై సినిమాల కోసం కలిసి పనిచేశారు.