Templates by BIGtheme NET
Home >> Cinema News >> సారా సడెన్ గా రూట్ మార్చిందిలా

సారా సడెన్ గా రూట్ మార్చిందిలా


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన పంజా చిత్రంలో నటించింది సారా జేన్ డయాస్. ఆ మూవీ డిజాస్టర్ గా నిలవడంతో ఈ అమ్మడి కలలన్నీ కల్లలయ్యాయి. తానొకటి తలిస్తే అన్న చందంగా సారా జేన్ కి అవకాశాలేవీ లేకుండా అయిపోయింది. ఆ తర్వాత తమిళంలో అడపాదడపా అవకాశాలు అందుకున్నా కానీ అక్కడా రాణించలేకపోయింది.

చాలా గ్యాప్ తర్వాత ఇదిగో ఇలా సోషల్ మీడియాల ద్వారా అభిమానులకు టచ్ లోకి వచ్చింది. సాటి నాయికలతో పోటీపడాలంటే అందుకు తగ్గట్టే గ్లామర్ ఎలివేషన్ తో రెచ్చిపోవాలి. ఈ విషయంలో తాను తక్కువేమీ కాదని ప్రూవ్ చేస్తోంది.

ఇటీవల ఈ భామ వరుస ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. హాట్ కంటెంట్ ని అభిమానుల కోసం ఇన్ స్టాలో షేర్ చేస్తోంది. ఈ సిరీస్ లో లేటెస్ట్ ఫోటో కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది. కనీసం ఈ ప్రయత్నం చూశాక అయినా సారా జేన్ కి అవకాశం ఇస్తారేమో చూడాలి. తమిళంలో ఇటీవల ఓ ఆఫర్ ని ఖాయం చేసుకుందన్న సమాచారం ఉంది.