Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘బిగ్ బాస్’ కి వెళ్లే వారందరూ అలాంటి వారేనా…?

‘బిగ్ బాస్’ కి వెళ్లే వారందరూ అలాంటి వారేనా…?


ఇండియన్ స్మాల్ స్క్రీన్ పై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోస్ లో ‘బిగ్ బాస్’ ఒకటని చెప్పవచ్చు. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అసలైన రియాలిటీ షో మజాని పరిచయం చేసింది ‘బిగ్ బాస్’. ఈ షోకు ఫస్ట్ సీజన్ నుంచే భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో దీనిపై ఎన్నో విమర్శలు వివాదాలు కూడా చెలరేగాయి. అయితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ‘బిగ్ బాస్’ ఇప్పుడు సీజన్ 4 కి సిద్ధం అవుతోంది. ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 4 కి అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే ‘కింగ్’ నాగ్ తో బిగ్ బాస్ ప్రోమోస్ కూడా రెడీ చేశారు.

బుల్లితెరపై సూపర్ సక్సెస్ అయిన ఈ రియాలిటీ షోలో పాల్గొనడానికి సెలబ్రిటీలు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో ‘బిగ్ బాస్’ నిర్వాహకులు ఇప్పటికే కంటెస్టెంట్స్ ని ఫైనలైజ్ చేసారని వార్తలు వస్తున్నాయి. ‘బిగ్ బాస్ 4’లో పాల్గొనే వారు వీరేనంటూ పలువురు సెలబ్రిటీస్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే ‘బిగ్ బాస్’ షోలో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ సినిమాల్లో సీరియల్స్ లో అవకాశాలు కోల్పోయినవారే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కాగా ‘బిగ్ బాస్’ రియాలిటీ షో లో పాల్గొనాలంటే ఫ్యామిలీకి దూరంగా ఉండటంతో పాటు చాలా రోజులు కేటాయించాల్సి ఉంటుంది. ఆఫర్స్ తో బిజీగా ఉన్నవారు అన్ని రోజులు డేట్స్ ఇవ్వడం అంటే జరిగే పని కాదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వెండితెరపై అటు బుల్లితెరపై హవా తగ్గిపోయిన వారు మాత్రమే బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెడుతున్నారని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు. ‘బిగ్ బాస్ 4’ కి వాళ్లు వస్తున్నారు వీళ్లు వస్తున్నారు అని టాక్ స్ప్రెడ్ అవుతున్న సంగతి తెలిసిందే. వీళ్లంతా ఆ కోవకు చెందిన వారే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.