`బచ్చన్ పాండే`గా స్టార్ హీరో మరో క్రేజీ ప్రయోగం?

0

కిలాడీ అక్షయ్ కుమార్ తన కెరీర్ ఆద్యంతం ప్రయోగాత్మక కథాంశాల్ని ఎంచుకుని విలక్షణమైన పాత్రల్లో నటించారు. కామెడీ ఫన్ సెటైర్ దేశభక్తి ఇలా అన్ని వెరైటీలు ట్రై చేశారు. మార్షల్ ఆర్ట్స్ తో ఇండస్ట్రీ బెస్ట్ యాక్షన్ హీరోగా రాణించాడు. ఇటీవలే లక్ష్మీ బాంబ్ లాంటి హారర్ చిత్రంలో హిజ్రా పాత్రతోనూ అభిమానుల ముందుకొచ్చాడు.

ప్రస్తుతం సాజిద్ నడియావాలా రూపకల్పనలోని `బచ్చన్ పాండే`లో అక్షయ్ నటిస్తున్నారు. ఈ టీమ్ తో అర్షద్ వార్సీ లాంటి ట్యాలెంటెడ్ స్టార్ కలిసారు. బచ్చన్ పాండేలో అక్షయ్ కుమార్ ఒక నటుడిగా ఉండాలని కోరుకునే గ్యాంగ్ స్టర్ పాత్ర పోషిస్తుండగా.. అర్షద్ వార్సీ కిలాడీ అక్షయ్ ఫ్రెండ్స్ లో ముఠా సభ్యుడిగా కనిపిస్తాడట.

ఈ చిత్రంలో కృతి సనోన్ కూడా నటిస్తోంఇ. షూటింగ్ జనవరి 2021 నుంచి జైసల్మేర్ లో ప్రారంభమవుతుంది. చిత్రీకరణ వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగుతుంది. ఈ భారీ యాక్షన్-కామెడీ చిత్రం కోసం కుమార్ .. వార్సీతో కలిసి జట్టుకట్టడం ఇదే మొదటిసారి. ఫర్హాద్ సంజీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా సాజిద్ నడియావాలా నిర్మిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో బచ్చన్ పాండే ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించారు అక్షయ్. కోర మీసం.. గుడ్డి కన్ను.. నల్ల లుంగీ.. బంగారు గొలుసుల స్ట్రింగ్ .. నుదిటిపై విభూదితో వెరైటీ లుక్ ఆకర్షించింది.

బచ్చన్ పాండేతో పాటు బెల్ బాటమ్ కోసం అక్షయ్ సన్నద్ధమవుతున్నాడు. ఆ మూవీలో వాణీకపూర్- హుమా ఖురేషి – లారా దత్తా ఇందులో నాయికలుగా నటిస్తున్నారు.