ఒంటిపై నూలు పోగైనా లేకుండా పాపులర్ గాయని!

0

సంచలనాలు ఆమెకు కొత్తేమీ కాదు. నగ్నత్వం అనేది తన జన్మహక్కు అన్నట్టుగానే ఉంటుంది అందాల ప్రదర్శన. 51 వయసులోనూ అదే స్పీడ్. సింగింగ్ డ్యాన్సింగ్ యాక్టింగ్ వృత్తి ఏదైనా గడగడలాడిస్తుంది. అంత గొప్ప ప్రతిభావని కాబట్టే ఎంతోమంది యంగ్ ట్యాలెంట్ దూసుకొచ్చినా ఇప్పటికీ తన ఉనికిని చాటుతోంది. ఇంతకీ ఎవరా గాయని కం నటి? అంటే .. ది గ్రేట్ జెన్నిఫర్ లోపేజ్.

వయసు మీరుతున్నా ఇంకా నగ్న ఫోటోషూట్లతో జెలో చెలరేగుతున్న తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆమె తాజా సింగిల్ ‘ఇన్ ది మార్నింగ్’ కోసం కవర్ ఆర్ట్ వీక్షిస్తే షాక్ తినాల్సిందే. హాలీవుడ్ టాప్ స్టార్లలో జెన్నిఫర్ స్కిన్ టోన్ అద్భుతమైన ఫిజిక్ గురించి అభిమానులు ఎక్కువగా మాట్లాడుతుంటాయి. 51 ఏళ్ల ఈ కళాకారిణి తన తాజా సింగిల్ కవర్ ఆర్ట్ ను తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్ట్ చేయగానే క్షణాల్లో వైరల్ అయిపోయింది. జెలో ఈ ఫోటోషూట్ తో తన అభిమానులందరినీ కదిలించింది. ఫోటోలో జెన్నిఫర్ తన ఎంగేజ్ మెంట్ రింగ్ తప్ప మరేమీ ధరించకుండా పూర్తిగా నగ్నంగా కనిపించింది. ఆమె కండపుష్ఠి శరీర ధృఢత్వం.. టోన్డ్ యాబ్స్ ఎంతో విజిబుల్ గా ఆకర్షిస్తున్నాయి.

“ఆశ్చర్యం! శుక్రవారం #ఇన్ ది మార్గింగ్ సింగిల్ డ్రాప్స్ కోసం అధికారిక కవర్ ఆర్ట్ ఇదే!“ అంటూ జెలో ప్రకటించింది.

హలో! 2016 ఇంటర్వ్యూలో జెలో మాట్లాడుతూ “పని చేయడం నాకు చాలా ఆనందాన్ని కలిగించే విషయమని నేను 100 శాతం నమ్ముతున్నాను. నృత్యం ఎల్లప్పుడూ నా జీవితంలో చాలా భాగం. నా శరీరాన్ని కదిలించడం.. మంచి పనిని చేయడానికి సమయం కేటాయించడం నా ఆనందానికి కీలకం” అంటూ జెలో ఎమోషనల్ గా స్పందించింది. పుష్కలంగా నీరు త్రాగటం.. ముఖ్యంగా వ్యాయామం చేసే ముందు.. వర్కవుట్లు మీ వ్యాయామ దినచర్య నుండి బయటపడటానికి సహాయపడతాయి అని తెలిపారు.

జెన్నిఫర్ లోపెజ్ ఈ నెల ప్రారంభంలో ఓ ఈవెంట్లో శక్తివంతమైన మహిళగా తనదైన ప్రసంగం చేశారు! పీపుల్స్ ఛాయిస్ అవార్డు 2020 లో పీపుల్స్ ఐకాన్ గా ఆమె పేరు మార్మోగింది.