అభిమానులను నిరాశపర్చిన అసిన్

0

సౌత్ లో హీరోయిన్ గా పరిచయం అయ్యి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని గజినీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఉత్తరాది ప్రేక్షకులను కూడా అలరించిన ఈ అమ్మడు హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. ప్రస్తుతం మూడు సంవత్సరాల బేబీతో ఫ్యామిలీ జీవితాన్ని సాఫీగా సాగిస్తుంది. ఇలాంటి సమయంలో అసిన్ రీ ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. హీరోయిన్ పాత్రలు కాకున్నా కథలో ప్రాముఖ్యత ఉన్న సినిమాల్లో ఆఫర్లు ఇస్తే తప్పకుండా నటిస్తానంటూ అసిన్ చెప్పిందని గత మూడు నాలుగు రోజులుగా మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంకు అసిన్ బ్రేక్ వేసింది. ఢిల్లీలో ఉంటున్న అసిన్ ప్రముఖ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడింది. తాను సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వస్తున్న వార్తలు అన్ని కూడా పుకార్లే. ప్రస్తుతానికి తనకు అలాంటి ఆలోచన ఏమీ లేదని కుటుంబంతో హ్యాపీగా జీవితాన్ని గడిపేస్తున్నట్లుగా చెప్పింది. అసిన్ రీ ఎంట్రీ వార్తలు రాగానే తెగ ఆనందించిన ఆమె అభిమానులు ఆమె క్లారిటీ ఇవ్వడంతో నీరు గారి పోయారు. ఇప్పుడు కాకున్నా ఇంకొన్నాళ్ల తర్వాత అయినా అసిన్ రీ ఎంట్రీ ఇవ్వాలని వారు ఆశపడుతున్నారు.