బిగ్ బాస్ ఓటింగ్ ను బహిష్కరించాల్సిందే!

0

తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ నుండి కూడా ఒక్కరు ఇద్దరు ఎలిమినేషన్ విషయంలో ఓటీంగ్ ప్రకారం ఎలిమినేషన్ జరగడం లేదేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. తాము అభిమానించే వారు ఎలిమినేట్ అయిన సమయంలో అలాంటి వ్యాక్యలు చేయడం కామన్ గా జరుగుతుంది. ప్రతి సీజన్ లో కూడా ఉండేదే కదా అని ఈ సీజన్ కు అనుకోవడానికి లేకుండా పోయింది. ఎందుకంటే ఈ సీజన్ లో కొద్ది మంది కాదు చాలా ఎక్కువ మంది ఓటీంగ్ ద్వారా ఎలిమినేషన్ జరగడం లేదు అంటూ బలంగా వాదిస్తున్నారు. బలమైన కంటెస్టెంట్స్ పిచ్చిగా పులిహోరకు సహకరించని వారు పులిహోర కలిపేందుకు ఆసక్తి చూపని వారు పిచ్చి పనులు చేయని వారు ఎలిమినేట్ అవుతున్నారు.

దేవి నుండి మొదలుకుని నిన్నటి ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిన దివి వరకు దాదాపు అంతా కూడా రాంగ్ ఎలిమినేషన్ అంటూ విమర్శలు వస్తున్నాయి. దేవి కంటే మెహబూబ్ కు ఓట్లు తక్కువ వచ్చాయి అయినా కూడా అతడిని సేవ్ చేశారు. కుమార్ సాయి కంటే మోనాల్ కు ఓట్లు తక్కువ వచ్చాయి అయినా కూడా కుమార్ సాయిని ఎలిమినేట్ చేశారు. నిన్నటి ఎపిసోడ్ లో కూడా మోనాల్ ఖచ్చితంగా ఎలిమినేట్ అనుకుంటే ఇప్పుడేమో దివిని ఎలిమినేట్ చేశారు. ఆమె తెలుగు మాట్లాడేందుకు చాలా కష్టపడుతుంది. ఆమె ఎప్పుడు ఏడుస్తూ అబ్బాయిలతో ఆట ఆడేసుకుంటుంది. దాంతో ఆమెకు ఈసారి చాలా తక్కువ ఓట్లు పడి ఉంటాయి. అయినా కూడా ఆమె ఉంటే కాస్త రొమాన్స్ వర్కౌట్ చేయవచ్చు అనే ఉద్దేశ్యంతో ఉంచుతున్నారు.

మోనాల్ విషయంలో ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చారు. ఈసారి మరో అవకాశం ఆమెకు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. దివి ఒక మంచి ప్లేయర్. ఆమె టాస్క్ ల్లో ఢీ అంటే ఢీ అన్నట్లుగా కాకున్నా కూడా ఒక మోస్తరుగా అయితే ఖచ్చితంగా ఆడుతుంది. ఇక కొన్ని లేడీస్ కు సంబంధించిన టాస్క్ ల్లో మంచి ఫెర్ఫార్మెన్స్ చేసింది. అందంతో పాటు మంచి నడవడిక ఉన్న అమ్మాయిగా అభిమానులు ఆమెకు ఉన్నారు. బాగానే ఓట్లు వేశారు. కాని ఆమె మాత్రం ఎలిమినేట్ అయ్యింది అంటే ఖచ్చితంగా మోనాల్ వల్లే అంటున్నారు. ఓట్ల ప్రకారం ఎలిమినేషన్ జరగనప్పుడు ఓట్లు వేసి ఏం లాభం అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వారం నుండి ఓటీంగ్ ను బహిష్కరించాలని భావిస్తున్నట్లుగా నెటజన్స్ అంటున్నారు.