ఇస్మార్ట్ డబుల్ ట్రీట్ కి RED రెడీ!

0

ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. ఆ వెంటనే కిషోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ లో RED చిత్రానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. స్రవంతి రవికిశోర్ ఈ చిత్రన్ని నిర్మించారు. ఇప్పటికే అన్నిపనులు పూర్తి చేసుకుని ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. మహమ్మారీ వల్ల ఆలస్యమైనా.. ఈ చిత్రం సంక్రాంతి కి విడుదల చేస్తున్నామని చిత్రబృందం వెల్లడించింది.

స్రవంతి మూవీస్ లో రామ్ తో చాలా మంచి సినిమాలు చేశాం. ఇదీ మరో మంచి సినిమా అవుతుంది. మణి శర్మ తొలిసారిగా మా సంస్థ లో పని చేశారు. ఇదో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కం లవ్ ఎంటర్ టైనర్. ఆద్యంతం ఎమోషన్స్ రక్తి కట్టిస్తాయి. కేవలం క్రైమ్ ఎలిమెంట్ మాత్రమే కాదు.. ఇందులో చక్కని లవ్ స్టోరి ఉంది. మదర్ సెంటిమెంట్.. ఎంటర్ టైన్ మెంట్ హైలైట్ గా నిలుస్తాయని నిర్మాత తెలిపారు .

నా కెరీర్ 18వ సినిమా ‘రెడ్’. కిషోర్ దర్శకత్వంలో నాకిది మూడో సినిమా .ఫస్ట్ టైమ్ కెరీర్ లో ఒక థ్రిల్లర్ చేశాను .మాస్ – క్లాస్ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయని రామ్ వెల్లడించారు. కథ కొత్తతో కొత్త ట్రీట్మెంట్ రక్తి కట్టిస్తుందని వెల్లడించారు. ఇందులో నివేదా పేతురాజ్ మాళవికా శర్మ అమృతా అయ్యర్ నాజర్ తదితరులు నటించారు. పీటర్ హెయిన్స్ ఫైట్స్ హైలైట్ గా ఉండనున్నాయి. ఈ చిత్రంలో రామ్ ద్విపాత్రాభినయం హైలైట్ గా ఉండనుందని ఇదివరకూ రిలీజైన ప్రచార వీడియోలు వెల్లడించాయి.