Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఐదు పదుల వయసులో.. ఔరా! అనిపిస్తున్న బాలీవుడ్ కండలవీరుడు..

ఐదు పదుల వయసులో.. ఔరా! అనిపిస్తున్న బాలీవుడ్ కండలవీరుడు..


స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఇండియన్ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును క్రేజ్ ను సంపాదించుకున్నాడు సల్మాన్ భాయ్. ఎప్పుడు కూడా తన హార్డ్ వర్క్ డెడికేషన్.. ఈ రెండే తనను ఈ స్థాయికి తీసుకొచ్చాయని చెబుతుంటాడు. ప్రస్తుతం సల్మాన్ భాయ్ వయసు యాభై ఐదు సంవత్సరాలు. ఐదు పదుల వయసు మీద పడినా ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు ఈ హీరో. ఇక ప్రేమ అఫైర్స్ లాంటివి చాలా ఉన్నా అందులో ఏ ఒకటి కూడా పెళ్లిపీటల వరకు వెళ్లలేదు. ఇక అసలు విషయానికి వస్తే.. సల్మాన్ భాయ్ రీసెంట్ గా సోషల్ మీడియాలో తన కొత్త పిక్ షేర్ చేసాడు. ఆ ఫోటో చూస్తే ఎలాంటి అమ్మాయి అయినా ఇట్టే మనసు పారేసుకుంటుంది.

ఏజ్ మాత్రమే పై బడుతుంది కానీ సల్మాన్ భాయ్ లో ఉన్న ఆ ఫిట్నెస్ మంత్రా మాత్రం ఇంకా అలాగే ఉందనిపిస్తుంది. ఆ పిక్ చూస్తే.. సల్మాన్ కండలు చూసి ఫిదా అయిపోవాల్సిందే. ఇక సోషల్ మీడియాలో సల్మాన్ భాయ్ కి కోట్లలో ఫ్యాన్స్ ఫాలోయర్స్ ఉన్న సంగతి తెలిసిందే. బూడిద రంగు టోపీతో పాటు పుష్టిగా పెంచిన కండలతో కూర్చున్న పోజు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేగాక మిలియన్ల ఫాలోయర్స్ లైక్స్ కొడుతూ షేర్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సల్మాన్ భాయ్ చేస్తున్న సినిమాల సంగతి చూస్తే.. ఆయన ప్రొడక్షన్ లో తెరకేక్కిన కాగజ్ అనే సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. అంతేగాక ప్రభుదేవా దర్శకత్వంలో రాధే మూవీతో పాటు కిక్ 2 ఆంటీమ్ కబీ ఈద్ కబీ దీవాలి సినిమాలు చేస్తున్నాడు.