Templates by BIGtheme NET
Home >> Cinema News >> బాలు ఆరోగ్యం : గుడ్ న్యూస్ చెప్పిన చిరు

బాలు ఆరోగ్యం : గుడ్ న్యూస్ చెప్పిన చిరు


ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనాతో పోరాటం చేస్తున్న విషయం తెల్సిందే. చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నట్లుగా వైధ్యులు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా బాలు గారు ఐసీయూలోనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం కుదుట పడాలని మళ్లీ ఆయన మైక్ ముందుకు వచ్చి పాడాలని కొన్ని కోట్ల మంది అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఒక గుడ్ న్యూస్ తో సోషల్ మీడియా ముందుకు వచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఒక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. సోదర సమానుడు అయిన బాలసుబ్రమణ్యం గారి ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఈ విషయం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఆయన వైధ్యంకు స్పందిస్తున్నాడు. అందుకే ఆయన గురించి ఆందోళన చెందుతున్న వారి కోసం ఈ విషయాన్ని చెప్పేందుకు వచ్చాను.

మామద్య సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి సంబంధం ఉంది. నేను ఆయన్ను అన్నయ్య అని పిలుస్తున్నాను. బాలు గారి చెల్లెల్లు నన్ను అన్నయ్య అంటూ పిలుస్తారు. చెన్నైలో ఉన్న సమయంలో పక్క పక్క వీధుల్లో ఉండేవాళ్లం. రెగ్యులర్ గా కలుస్తూ ఉండేవాళ్లం అంటూ బాలుగారితో అనుబంధంను మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on