‘ఆదిపురుష్’ పుకార్లు షురూ

0

Prabhas s Magnum Opus Adipurush Launched With Om Raut

Prabhas s Magnum Opus Adipurush Launched With Om Raut

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌమ్ రూపొందించబోతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆదిపురుష్’. భారీ అంచనాలున్న ఈ సినిమాను వచ్చే ఏడాదిలో ప్రారంభించి 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామంటూ ప్రకటించారు. అంతకు మించి సినిమా గురించి ఎలాంటి విషయాలను అధికారికంగా వెళ్లడి చేయలేదు. అయినా కూడా బాలీవుడ్ మీడియా నుండి స్థానిక మీడియా వరకు అంతటా ఆ సినిమాకు సంబంధించిన ప్రచారం మొదలయ్యింది. సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్ కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు పుకార్లు పుట్టిచేస్తున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడు అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. అయినా కూడా చాలా మంది రాముడి మాదిరిగా ప్రభాస్ కనిపించబోతున్నాడు అంటూ బలంగా నమ్ముతున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను ఎంపిక చేసే విషయమై చర్చలు జరుగుతున్నాయని కొందరు లేదు సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ను ఎంపిక చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా కొందరు చెబుతున్నారు. మొత్తానికి హీరోయిన్ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఆమద్య నాగ్ అశ్విన్ సినిమా హీరోయిన్ విషయంలో కూడా ఇలాగే చర్చ జరిగింది. చివరకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునేను ఎంపిక చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. అలాగే ఈ ఆదిపురుష్ చిత్రానికి కూడా బాలీవుడ్ హీరోయిన్ ఫైనల్ అయ్యే అవకాశం ఉందనిపిస్తుంది. ప్రియాంక చోప్రా పేరు అయితే ఎక్కువగా వినిపిస్తుంది అంటున్నారు. మరి అసలు విషయం ఏంటీ అనేది షూటింగ్ ప్రారంభం అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.