బాలయ్య- బోయపాటి క్రేజీ కాంబో.. BB3కి టైటిల్ ఫిక్స్! సర్‌ప్రైజ్ ఎప్పుడంటే..

0

సింహ, లెజెండ్ సినిమాలతో భారీ హిట్స్ రాబట్టి హాట్రిక్ హిట్ ప్లాన్ చేసింది బోయపాటి- బాలకృష్ణ కాంబో. ఈ మేరకు మరో మాస్ ఓరియెంటెడ్ కథతో సెట్స్ మీదకొచ్చారు. BB3 పేరుతో రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇటీవలే లాక్ చేసింది చిత్రయూనిట్. మే నెల 28వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు తెలపడంతో అందరి కళ్లు సినిమా టైటిల్‌పై పడ్డాయి. ఇంతకీ ఈ మూవీకి ఏ టైటిల్ ఫిక్స్ చేసినట్లు అనే చర్చలు ముదిరాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇందుకు సంబంధించిన ఓ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ క్రేజీ సినిమాకు ‘మోనార్క్’ అనే టైటిల్‌నే ఫైనల్ చేశారని, ఈ టైటిల్‌ను మహా శివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఈ టాక్ బయటకొచ్చిన క్షణం నుంచి అందరి చూపు ఆ డేట్‌పై పడింది. ఇటీవలే ఈ మూవీ నుంచి విడుదల చేసిన ‘బీబీ3 ఫస్ట్ రోర్’ నందమూరి అభిమానులను హుషారెత్తించింది. బోయపాటి మార్క్ చూపిస్తూ బాలయ్య చేత చెప్పించిన ఊరమాస్ డైలాగ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి.

నిజానికి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ కావాల్సిఉండగా కరోనా లాక్ డౌన్ కారణంగా కొన్ని నెలలపాటు వాయిదా పడింది. దీంతో ప్రస్తుతం షూటింగ్ వేగం పెంచేసిన బోయపాటి అతిత్వరలో షూటింగ్ ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో ఈ మూవీ రూపొందుతోంది. ఈ భారీ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.