Templates by BIGtheme NET
Home >> Cinema News >> మహేష్ రికార్డ్స్ ని బ్రేక్ చేసిన బన్నీ…!

మహేష్ రికార్డ్స్ ని బ్రేక్ చేసిన బన్నీ…!


అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రాన్ని హాసిని అండ్ హారిక క్రియేషన్స్ మరియు గీతాఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా సుశాంత్ – నివేద పేతురాజ్ లు ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా బన్నీ కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచిపోయింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి అందించిన సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా వచ్చి ఏడు నెలలు దాటినా ‘అల వైకుంఠపురములో’ సాంగ్స్ ఇంకా మోగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనే ఆల్ టైం టీఆర్పీ రికార్డును నెలకొల్పింది.

కాగా ఆగస్టు 16న జెమినీ ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం 29.4 టీఆర్పీ రేటింగ్ ని సాధించింది. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన జనాలు ‘అల..’ని స్మాల్ స్క్రీన్ పై టాప్ లో నిలబెట్టారు. దీంతో ఇప్పటి వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ 23.4 టీఆర్పీని బ్రేక్ చేసినట్లయింది. సంక్రాంతి వార్ లో బాక్సాఫీస్ మొగుడు.. రంకు మొగుడు అంటూ పోటీపడిన ఈ రెండు సినిమాలు మరోసారి బుల్లితెరపై రేటింగ్స్ పోటీపడ్డాయి. అయితే టీఆర్పీ రేటింగ్స్ లో బన్నీ పైచేయి సాధించాడని చెప్పవచ్చు. ఈ రెండు సినిమాల తర్వాత ‘బాహుబలి – 2’ 22.7 టీఆర్పీతో మూడో స్థానంలో ఉండగా ‘శ్రీమంతుడు’ 22.54 టీఆర్పీతో నాలుగో స్థానంలో నిలిచింది.

అయితే ‘అల వైకుంఠపురములో’ మూవీకి ఈ రేంజ్ లో టీఆర్పీ రావడానికి కరోనా తో పాటు నెట్ ఫ్లిక్స్ మరియు సన్ నెక్స్ట్ కూడా కారణమనే కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే మిగతా ఓటీటీలతో పోల్చుకుంటే నెట్ ఫ్లిక్స్ మరియు సన్ నెక్స్ట్ నెలసరి చందా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే తక్కువ చందా ఉండే అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో సదరు ఓటీటీలలో ఈ సినిమాని ఎక్కువ మంది చూడలేకపోయారు. దీంతో ఫస్ట్ టైం ‘అల వైకుంఠపురములో’ టీవీలో టెలికాస్ట్ అవుతుండటంతో భారీ వ్యూయర్ షిప్ వచ్చినట్లు తెలుస్తోంది.