మరో వీడియోతో వైరల్ అయిన ప్రగతి

టాలీవుడ్ నటి ప్రగతి ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న విషయం తెల్సిందే. డాన్స్ లు మరియు జిమ్ వీడియోలు ఫొటోలతో పదే పదే సందడి చేస్తున్న విషయం తెల్సిందే. సినిమాల్లో చూసిన దానికి సోషల్ మీడియాలో ఆమెను చూసిన దానికి ఎంత తేడా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా మరో వీడియోతో ప్రగతి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. బంటీ ఔర్ బబ్లీ సినిమాలోని కజురారే పాటకు ప్రగతి డాన్స్ చేసింది.

ఇంతకు ముందు వీడియోల కంటే ఈ వీడియో మరింత పాపులర్ అవుతోంది. నెట్టింట ఈమె వీడియోకు మంచి అభిమానులు అవుతున్నారు. ఈమె ఈ సోషల్ మీడియా సందడి అంతా కూడా కేవలం బిగ్ బాస్ ఎంట్రీ కోసం అంటూ ప్రచారం జరిగింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ తనకు బిగ్ బాస్ వెళ్లాల్సిన అవసరం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. నాకు ఇప్పటి వరకు చెడ్డ పేరు లేదు అలా అని డబ్బు అవసరం లేదు.

చెడ్డ పేరు నాకు లేదు అలాగే డబ్బు అవసరం కూడా నాకు లేదు కనుక బిగ్ బాస్ ఎంట్రీ అవసరం లేదు అని క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఇలాంటి వీడియోలు చేయడం వల్ల ముందు ముందు అమ్మా అత్త పాత్రలు వచ్చేనా అనేది అనుమానమే అంటున్నారు.

Do something that makes u feel good everyday 😍🧡💫💯

null

Related Images: