‘పుష్ప’ అక్కడికే వెళ్తాడట…!

0

సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’. పాన్ ఇండియా మూవీగా రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ ఎక్కువ భాగం అడవుల్లో జరుపుకోవాల్సి ఉంది. దీని కోసం కేరళ అడవుల్లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేయగా కరోనా వచ్చి తారుమారు చేసింది. అయితే ఇప్పుడిప్పుడే షూటింగ్స్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ‘పుష్ప’ కూడా త్వరలోనే సెట్స్ లో అడుగుపెడతాడని తెలుస్తోంది.

కాగా కరోనా నేపథ్యంలో అవుట్ డోర్ కంటే ఇండోర్ షూటింగ్స్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక ‘పుష్ప’ ని కూడా లోకల్ గా ఉన్న తెలంగాణ వికారాబాద్ అడవుల్లోనో లేదా ఆంధ్రప్రదేశ్ రంపచోడవరం ప్రాంతంలోనో చిత్రీకరించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ‘పుష్ప’ షూటింగ్ మళ్ళీ కేరళలోనే ప్లాన్ చేస్తున్నారట. మల్లూ అర్జున్ గా మాలీవుడ్ లో బన్నీకి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని అక్కడి నేటివిటీ ఉట్టిపడేలా లొకేషన్స్ ఉంటే బాగుంటుందని సుకుమార్ భావిస్తున్నాడట. అందుకే కేరళ షెడ్యూల్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.