ఈమె ఎవరో గుర్తు పట్టగలరా?

0

స్టైలిష్ లుక్ తో ఐఫోన్ తో సెల్ఫీ తీసుకుంటున్న ఈ అమ్మడిని గుర్తు పట్టారా.. మాస్క్ పెట్టుకుని ఉన్న ఈ అమ్మడు టాలీవుడ్ లో మెగా హీరోతో ఎంట్రీ ఇచ్చింది. చిన్న వయసులోనే పెద్ద హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. మెగా హీరోతో చేసిన సినిమాలో సన్యాసినిగా కొద్ది సమయం కనిపించి తన అందమైన శరీరంను మట్టి అంటూ మాట్లాడి అబ్బా అనిపించింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో తన అందాలతో అదరగొట్టింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అభిమానులను సొంతం చేసుకుంది.

ప్రస్తుతం ఈమె తెలుగు కంటే తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తుంది. ఈ తరం హీరోయిన్స్ లో 50 సినిమాలు పూర్తి చేసుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఈమె కూడా ఒక్కతిగా నిలిచింది. అడపా దడపా తెలుగులో కూడా ఇంకా నటిస్తూనే ఈ అమ్మడిని ఇప్పటికి అయినా గుర్తు పట్టారా.. ఔను హన్సిక. దేశముదురు సినిమాతో అల్లు అర్జున్ తో కలిసి నటించి మెప్పించిన ఈ అమ్మడు ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ లో నటించింది. ఇక్కడ మంచి ఆఫర్లు వస్తున్న సమయంలోనే కోలీవుడ్ లో కూడా బిజీ అయ్యింది. ప్రస్తుతం ఈమె చేస్తున్న మహాతో 50 సినిమాలను పూర్తి చేసుకుంది.