ముద్దుల మనవడితో చిరునవ్వులు చిందిస్తున్న బాలయ్య..!

0

నందమూరి బాలకృష్ణ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతాడనే విషయం తెలిసిందే. ఇప్పుడు కొడుకూ కూతుళ్లతో పాటు మనవళ్లు కూడా ఉండటంతో కుదిరినప్పుడల్లా వారితో సమయం గడుపుతుంటారు. తీరిక సమయంలో వారిలో బాలయ్య అల్లరి చేస్తుంటాడు. బాలకృష్ణ ఇద్దరి కుమార్తెలలో పెద్దమ్మాయి బ్రాహ్మిణి ని నారా లోకేష్ కి ఇచ్చి వివాహం చేసిన సంగతి తెలిసిందే. వీరికి దేవాన్ష్ అనే కుమారుడు ఉన్నాడు. అలానే చిన్న కూతురు తేజస్విని కి గీతం యూనివర్సిటీ సీఈఓ భరత్ తో 2013లో వివాహం జరిపించారు. వీరికి కూడా ఓ కొడుకు ఉన్నాడు. తన మనవళ్ల గురించి బాలయ్య అనేక సందర్భాలలో వెల్లడించారు. వారికి నాన్నగారి ఫోటోలు వీడియోలు చూపించి వివరిస్తానని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. తాజాగా బాలయ్య తన ముద్దుల మనవడితో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఫొటోలో తేజస్విని కుమారుడుని బాలయ్య తనపై కూర్చొని పెట్టుకొని ఉన్నాడు. ట్రెడిషినల్ దుస్తుల్లో ఉన్న తాతా మనవళ్లు చిరునవ్వులు చిందిస్తున్నారు. ఈ ఫోటో ఎప్పటిదో తెలియనప్పటికీ బాలయ్య రాయల్ లుక్.. మనవడి క్యూట్ స్మైల్ చూసి నందమూరి అభిమానులు సంతోషిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘సింహా’ ‘లెజెండ్’ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగ్గట్టే BB3 టీజర్ అదరగొట్టింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.